English | Telugu

హాస్పిటల్ బెడ్ మీద అఖిల్.. టైం వచ్చినప్పుడు చెప్తాను!

అఖిల్ సార్థక్ బిగ్ బాస్ హౌస్ లో ఎంతగా సందడి చేసాడో ఇప్పుడు బీబీ జోడీలో తేజస్వినితో కలిసి అంతే సందడి చేస్తున్నాడు. వీళ్ళ పెర్ఫార్మెన్సెస్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు. కొన్ని రొమాంటిక్ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ లో మాత్రం రెచ్చిపోయి మరీ చేస్తున్నారు. ఏమయ్యిందో ఏమో కానీ రీసెంట్ గా అఖిల్ బాడీ మీద గాయమైనట్టు తెలుస్తోంది. ఐతే ఆ విషయాలను మాత్రం బయటకు రివీల్ చేయలేదు. అఖిల్ సార్థక్ హాస్పిటల్ బెడ్డు మీద ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నట్టుగా ఒక ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసాడు.

పొట్ట మీద ఏదో బలంగానే దెబ్బ తగిలినట్టు అనిపిస్తోంది..ఆ దెబ్బలకు కట్టు కట్టినట్టు కనిపిస్తోంది. ఐతే అసలు ఏం జరిగింది ఏమిటి అనే విషయం మీద మాత్రం తెలీదు. "చాలా బాగా ట్రీట్మెంట్ జరుగుతోంది. కానీ ఆ విషయాలను మాత్రం ఇక్కడ వివరించలేను. ప్రస్తుతానికి నాకు నయం అవుతోంది..రికవరీ అవుతున్నాను.టైం వచ్చినప్పుడు త్వరలో మీ అందరికీ క్లియర్ గా చెప్తాను నాకు ఏమయ్యింది అనే విషయాన్ని" అంటూ ఒక కాప్షన్ పెట్టాడు.

ఐతే బీబీ జోడి ప్రాక్టీస్ టైములో కావొచ్చు లేదా షూటింగ్ టైంలోనే ఏదో జరిగింది అన్న విషయం అఖిల్ వేసుకున్న డ్రెస్ బట్టి అర్ధమవుతోంది. అసలింతకీ తనకు ఏం జరిగిందనే విషయాన్ని అఖిల్ చెప్పే వరకు ఫాన్స్ వెయిట్ చేయక తప్పదు. రీసెంట్ గా అరియానా కూడా బీబీ జోడి డాన్స్ పెర్ఫార్మెన్స్ టైంలో తన చేతికి అవినాష్ వల్ల ఐన గాయాన్ని చూపించి చాలా బాధ పడింది. ఈ బీబీ జోడి షోలో డాన్స్ పెయిర్స్ అంతా కూడా చాలా కష్టమైన డాన్స్ స్టెప్స్ వేస్తున్నారు. దాంతో వాళ్లకు గాయలవుతున్నాయన్న విషయం అర్ధమవుతోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.