English | Telugu
గ్రాండ్ గా తరుణ్ మాస్టర్ బర్త్ డే సెలెబ్రేషన్స్
Updated : Aug 20, 2023
తరుణ్ మాస్టర్ అంటే ఆయనలో మనకు గుర్తొచ్చే యాంగిల్ ఒకటి ఉంది... అదే కాయితాలు చింపి డాన్స్ బాగా పెర్ఫార్మ్ చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. డ్యాన్స్ షోలకు జడ్జిగా మంచి పేరు ఉంది తరుణ్ మాస్టర్ కి. రీసెంట్ గా ఆయన 56వ జన్మదిన వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ముందుగా ఆయన ఇంట్లో కేక్ కట్ చేసి తన యూట్యూబ్ ఛానల్ కి పని చేసే సిబ్బందితో సెలెబ్రేట్ చేసుకున్నారు.
తర్వాత " నీతోనే డ్యాన్స్ " టీమ్ అంతా కలిసి డాన్స్ సెట్ లో మళ్ళొకసారి బర్త్ డే సెలబ్రేషన్స్ ప్లాన్ చేసి తరుణ్ మాష్టర్ కి మెమొరబుల్ డేగా మార్చారు. ఆయన సంతోషంతో "నీతోనే డాన్స్" షో సెట్ లో ప్రతీ ఒక్కరినీ తన వీడియోలో బందిస్తూ తన వ్యూయర్స్ కి వాళ్ళ గురించి చెప్తూ తన బర్త్ డే సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. హీరోయిన్ "రాధా" కూడా ఆ సెలబ్రేషన్స్ లో భాగమయ్యారు. ఇంకొక జడ్జి "సదా" కూడా అక్కడే ఉన్నారు. తరుణ్ మాస్టర్ కేక్ కట్ చేస్తూ ఈరోజు తన ఒక్కడి పుట్టిన రోజే కాదని "రాధ"గారి కుతురిది కూడా అని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తారు.
అలాగే యాంకర్ శ్రీముఖి, యాదమ్మ రాజు భార్య కూడా అదే స్టేజ్ మీద డ్యాన్స్ లు వేస్తూ తరుణ్ మాష్టర్ కి ఒక వండర్ఫుల్ మెమొరీగా మార్చారు. అలాగే తరుణ్ మాస్టర్ శ్రీముఖితో సరదాగా స్టెప్పులు కూడా వేసారు. కేక్ కట్ చేసిన తరువాత అలాగే సెట్లో పని చేస్తున్న వారితో కలిసి అక్కడ ఉన్న డాన్సర్స్ అంతా కలిసి ఆయనకు కేక్ తినిపిస్తూ బర్త్ డే విషెస్ చెప్పారు. ఇంత మెమొరబుల్ డే గా మార్చిన తన బర్త్ డే ను తరుణ్ మాస్టర్ అందరికి థ్యాంక్స్ చెప్తూ, అలాగే తన యూట్యూబ్ చానెల్ వ్యూయర్స్ కి బర్త్ డే విషెస్ చెప్పినందుకు ధన్యవాదాలు చెప్పారు. తరుణ్ మాస్టర్ సెట్ లో ఎప్పుడూ జోష్ గా ఉంటూ మిగతా అందరిని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అలాగే అప్పుడప్పుడు కంటెస్టెంట్స్ తో కలిసి స్టేజి మీద స్టెప్పులేసి జడ్జెస్ మనసు దోచుకుంటూ ఉంటారు.