English | Telugu

ఆదర్శ్ గురించి తెలుసుకున్న భవాని.. అతను వెళ్ళిపోవడానికి కారణం అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ 240 లో.. మెడికల్ క్యాంప్ కి వెళ్ళిన కృష్ణ.. అక్కడ పేషెంట్స్ కి ట్రీట్ మెంట్ చేస్తూ తన బిజీలో తను ఉంటుంది. మురారి మాత్రం కృష్ణనే తలుచుకుంటాడు. కృష్ణకి ఫోన్ చేస్తాడు. కృష్ణ ఫోన్ లిఫ్ట్ చెయ్యదు. అయిన కృష్ణకి మురారి కంటిన్యూగా ఫోన్ చేస్తూనే ఉంటాడు. ఆ తర్వాత కృష్ణ ఫోన్ చూసుకొని చేసేసరికి.. మరారి ఫోన్ బిజీ వస్తుంది.

అప్పటికే మురారి ఫోన్ కి కమీషనర్ ఫోన్ చేస్తాడు. ఏంటి మురారి డల్ గా మాట్లాడుతున్నావని అడుగుతాడు. అప్పుడే మురారికి కృష్ణ ఫోన్ చేస్తుంది. అయిన కమీషనర్ తో మురారి మాట్లాడతాడు. ఒక క్యాంపు కి వెళ్ళాలని కమీషనర్ అనగానే.. డ్యూటీ చేస్తాను కానీ క్యాంప్ కి వెళ్ళనని మురారి చెప్తాడు. మరొక వైపు మురారి మళ్ళీ ఫోన్.. చేస్తాడేమో అని కృష్ణ వెయిట్ చేసి.. చెయ్యకపోయేసరికి కృష్ణ పేషెంట్స్ దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత మురారి ఇంటికి వస్తాడు. ఎటు చూసిన కృష్ణతో ఉన్న జ్ఞాపకాలను మురారి గుర్తు చేసుకుంటూనే ఉంటాడు. మరొక వైపు భవాని ఆదర్శ్ ఫోటో చూస్తూ ఎక్కడున్నావ్ ఆదర్శ్? ఒక్కసారి కూడా ఈ అమ్మతో ప్రేమగా మాట్లాడాలనిపించలేదా అంటూ బాధపడుతుంది. అప్పుడే భవానికి ఆర్మీ నుండి కల్నల్ ఫోన్ చేస్తాడు. మీకు ఒక గుడ్ న్యూస్.. ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్తాడు. బ్యాడ్ న్యూస్ చెప్పండి అని భవాని అడుగుతుంది. ఆదర్శ్ మీ ఇంటికి రావడానికి ఇష్టపడడం లేదని కల్నల్ అనగానే.. అయితే ఆదర్శ్ అడ్రస్ తెలిసిందా అని భవాని అడుగుతుంది. తెలిసింది మాక్కూడా తన ఇన్ఫర్మేషన్‌ ఏది తెలియకూడదని అనుకుంటున్నాడు. ఆదర్శ్.. మీ ఇంటికి ఇన్ని రోజులు కావాలనే రాలేదు. ఆదర్శ్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తానని కాల్నల్ చెప్తాడు. భవాని మాత్రం ఆదర్శ్ గురించి తెలిసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు ఆదర్శ్ ఎందుకు రావడానికి ఇష్టపడడం లేదని భవాని ఆలోచిస్తుంది.

ఆ తర్వాత ముకుంద పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమించిందా ఆ విషయం ఆదర్శ్ కి తెలిసి వెళ్ళిపోయాడా అని అనుకొని.. ముకుందని పిలుస్తుంది. నువ్వు ఎవరినైనా ప్రేమించావా అని భవాని గట్టిగా అడుగగానే.. ప్రేమించానని ముకుంద చెప్తుంది. ఆ విషయం ఆదర్శ్ కి చెప్పవా అని భవాని అడుగుతుంది. చెప్పలేదని ముకుంద చెప్తుంది. ఇంకా అతన్ని ప్రేమిస్తున్నావా? అతను నీ మనసులో ఉంటే ఈ క్షణమే ఈ ఇంటి నుండి వెళ్ళిపోమని భవాని అనగానే.. పెళ్లి తర్వాత అతన్ని నా మనసు నుండి తీసేసానని భవానికి ముకుంద అబద్దం చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.