English | Telugu
నడవలేని రష్మి... పొడవలేని సుధీర్!
Updated : Aug 21, 2023
ఈటీవీ 28 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఒక ఈవెంట్ చేస్తోంది. "ఈటీవీ బలగం" పేరుతో 27 వ తేదీన సాయంత్రం ప్రసారం కాబోతోంది. ఇప్పుడు ఈ ప్రోమో రిలీజ్ అయింది. చాలా రోజుల తరువాత మనల్ని మళ్ళీ కామెడీతో అలాగే తన మల్టీ టాలెంట్స్ తో మెస్మోరైజ్ చేసిన సుడిగాలి సుధీర్ ఎంట్రీతో అందరిలో జోష్ వచ్చేసింది. రాగానే సుధీర్ ను తన స్నేహితులు గెటప్ శ్రీను అలాగే ఆటో రాంప్రసాద్ ఒక ఆట ఆడేసుకున్నారు. ఇంతలో హైపర్ ఆది వచ్చి మీరు చాలా రోజుల తరువాత వచ్చారు కదా ఇంకొక రెండు సంవత్సరాలు ఇలాగే ఉంటె నేనే మీ మీద సినిమా తీస్తా అని కామెడీగా చెప్పాడు. ఇంతలో ఏ సినిమా అని రష్మీ అడిగేసరికి " నడవలేని రష్మి ,పొడవలేని సుధీర్" అని చెప్పేసరికి అందరూ నవ్వేశారు. తర్వాత ఏక్ హరి జోడి వచ్చి తమ ఫస్ట్ లవ్ ఈటివిలో ఫస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడే దొరికిందని చెప్పాడు. తర్వాత ఆమె తన వైఫ్ అయ్యిందన్నారు. వాళ్ళను చూసి ఆది కూడా రెండు పంచ్లు వేసేశాడు.
"ఫస్ట్ టైం ఎవరు ఎవర్ని ప్రపోజ్ చేశారు" అని రష్మీ ఏక్ హరి జోడిని అడిగేసరికి ఎలా చేశారో చూపిస్తూ "ఎర్లీ మార్నింగ్ 3 గం లకు కార్లో కిస్ చేసి ప్రొపోజ్ చేసా" అని చూపించాడు. తరువాత రౌడీ రోహిణి "శుభమస్తు" కార్యక్రమ యాంకర్ గా చేసింది. శుభమస్తు ప్రోగ్రాంకి వచ్చే పండితులు రోహిణి అడిగిన ప్రశ్నలకు చాలా కామెడీగా అందర్ని నవ్విస్తూ జోతిష్యం చెప్తారు. "సుడిగాలి సుధీర్ అడుగుతున్నారు నాది ఏ రాశి" అని అడిగేసరికి "12 రాశులలో కన్య రాశి, మిదున్ రాశి తప్ప అని రాసులు ఆయనవే" అని కామెడీ చేశారు. తర్వాత గెటప్ శీను "సుధా ఈ ప్రేమ పక్షులు గాల్లోనే ఎగురుతాయా...గూటికేమన్నా వెళ్తాయా" అనేసరికి సుధీర్ ఏం ఆన్సర్ చేసాడో తెలీదు కానీ రష్మీ మాత్రం కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఈ షోలో రైటర్ చంద్రబోస్, అలాగే బెదురులంక టీమ్ హీరో కార్తికేయ , నేహా శెట్టి ఈ షోని చాలా ఎంజాయ్ చేసారు. "అసలు నేను గుర్తున్నానా" అని రష్మీ అడిగేసరికి "గుర్తున్నావ్ కాబట్టే ఇలా ప్రాణాలతో బతికున్నా" అన్నాడు సుధీర్ . మరి ఇంతకు వీళ్ళు నిజంగానే పెళ్లి చేసుకుంటున్నారా ? లేదా అనే విషయం మీదా ఈ షోలో క్లారిటీ వచ్చేస్తుంది.
