English | Telugu

Sanjana vs Suman Shetty: సుమన్ శెట్టి అవుట్ ఆఫ్ ది రేస్.. సంజన లీడింగ్!

బిగ్ బాస్ సీజన్ కి శుభం కార్డ్ పడబోతుంది. ఈ వీక్ తో టాస్క్ లు అన్నీ కంప్లీట్ అవుతాయి. నామినేషన్ నుండి సేవ్ అవ్వడానికి బిగ్ బాస్ టాస్క్ లు ఇస్తున్నాడు. ఇక లీడర్ బోర్డుపై సుమన్ లీస్ట్ లో ఉండడంతో సుమన్ ని గేమ్ నుండి తొలగిస్తాడు బిగ్ బాస్. మీ పాయింట్స్ హౌస్ లోని ఎవరికైనా సగం పాయింట్స్ ఇవ్వొచ్చని బిగ్ బాస్ చెప్పాడు. అసలు సుమన్ అన్న న్యాయంగా ఆలోచిస్తే మనకి ఇవ్వాలని ఇమ్మాన్యుయేల్ తో డీమాన్ అంటాడు. ఎందుకు అంటే లాస్ట్ టాస్క్ లో మనల్ని తీశారని అంటాడు.

ఆ తర్వాత బిగ్ బాస్ అలా చెప్పగానే.. నాకు మీరే గుర్తువచ్చారు భరణి అన్న.. ఎందుకంటే ఈ హౌస్ లో నాకంటూ ఉంది మీరొక్కరే అని సుమన్ కంటతడి పెట్టుకుంటాడు.నిన్ను గేమ్ లో ఉంచాలని చాలా ట్రై చేశానని సుమన్ తో చెప్తూ భరణి ఎమోషనల్ అవుతాడు. నీ పాయింట్స్ నాతో పాటు హౌస్ లో ఇంకొకరికి కూడా అవసరమని భరణి చెప్పగానే సంజన గారికి అని సుమన్ చెప్తాడు.

ఆ తర్వాత సంజన దగ్గరికి సుమన్ వెళ్లి పాయింట్స్ మీకు ఇద్దామని అనుకుంటున్నానని చెప్పగానే చాలా థాంక్స్ అన్నా.. అసలు నేను ఎవరిని అడగను కానీ అడిగే సిచువేషన్ వచ్చిందని సంజన ఏడుస్తుంది. ఆ తర్వాత బిగ్ బాస్ చెప్పినప్పుడు సుమన్ తన స్కోర్, ఇంకా పాయింట్స్ లో సగం సంజనకి ఇవ్వగా సంజన లీడ్ లోకి వెళ్తుంది. ఇక సుమన్ నామినేషన్ నుండి సేవ్ అయ్యే అవకాశం కోల్పోతాడు.