English | Telugu
నా వల్ల మీ టైమ్ వేస్ట్ చేస్కోని ఉంటే క్షమించండి
Updated : Dec 30, 2023
బిగ్ బాస్ ద్వారా ఫేమస్ ఐన వ్యక్తి సయ్యద్ సోహైల్ ర్యాన్ ...బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక కొన్ని మూవీస్ లో నటించాడు టాలెంటెడ్ యంగ్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. హీరోగా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇందులో మేల్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్ లో సోహైల్ కనిపించాడు..ఇక ఇప్పుడు "బూట్ కట్ బాలరాజు" మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇక రీసెంట్ గా ఒక పిక్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు.
ఇక దానికి ఒక లాంగ్ కాప్షన్ పెట్టాడు. "ఓషన్ అంటే సముద్రం..అందులో ఫుల్గా నీళ్లుంటాయి..ఆ నీటి మొత్తంలో ఉప్పు ఉంటుంది...ఈ సముద్రం పక్కన బూట్‌కట్ బలరాజులు ఉన్నారు ఒక్కటి నేను ఇంకోకటి నా ఫ్రెండ్ ..మంచోడే వాడు ఆస్ట్రేలియాలో ఉంటాడు ...ఎందుకో తెలియదు. అసలు ఈ సముద్రాన్ని చూస్తూ ఏం ఆలోచిస్తున్నామో ఏం సాధించామో అర్థం కాలే...
కానీ ఈ పిక్స్ మాత్రమే బాగా వచ్చాయి అని పోస్ట్ చేస్తున్న..,ఇది చదివి మీరు ఒక్క నిమిషం టైమ్ వేస్ట్ చేస్కోని ఉంటే క్షమించండి . " అలాగే తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ఫన్నీ పోస్ట్ పెట్టాడు "బాడీ పెంచుతా ఇక..ఆగేది లేదు...ఈ బూట్ కట్ బాలరాజు ప్రొమోషన్స్ అయ్యి రిలీజ్ అయ్యాక న్యూ అవతార్ చూస్తారు. అలా వంద సార్లు అనుకున్నాం అంతే ఇప్పటికీ ఐతలేదు " అని పెట్టాడు. ఇక ఈ బూట్ కట్ బాలరాజు మూవీలో ఇంద్రజ కూడా ఒక కీరోల్ లో నటించారు.