English | Telugu

స్వప్న ప్రెగ్నెంట్ కాదన్న విషయం తెలిసిపోతుందా.. వాళ్ళిద్దరిని చూసి అప్పు జెలస్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -220 లో... రాజ్ చేసిన సహాయానికి కృష్ణమూర్తి థాంక్స్ చెప్తాడు. ఆ తర్వాత ఇక అసలైన ఎంటర్టైన్మెంట్ మొదలు అయిందంటూ కళ్యాణ్ చెప్తాడు.. నేను అప్పు కలిసి ఇప్పుడు డాన్స్ చెయ్యబోతున్నామని చెప్పి, రా అప్పు అంటూ అప్పుని కళ్యాణ్ స్టేజ్ మీదకి పిలుస్తాడు. దాంతో అప్పు వెళ్తుంది. అప్పు వెళ్లడంతో అనామిక జెలస్ గా ఫీల్ అవుతుంది. నేను చేస్తాను అప్పు, నువ్వు వెళ్ళు అని అమామిక అనగానే, లేదు ఇద్దరు చెయ్యండని కళ్యాణ్ అంటాడు. లేదు మీరే చెయ్యండి మీ జంట బాగుంది అంటూ అప్పు కిందకి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత కళ్యాణ్, అనామిక‌ ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారు. అలా ఇంట్లో ఉన్న అందరు డాన్స్ లు చేస్తారు. ఇక అందరూ కలిసి డాన్స్ చేస్తుండగా, స్వప్న తను ప్రెగ్నెంట్ అన్న విషయం మర్చిపోయి డాన్స్ చేస్తుంటే.. స్వప్న పెట్టుకున్న బెల్ట్ కిందపడిపోతుంది. అది స్వప్న చూసుకోదు. కానీ కావ్య కిందపడిపోయి ఉన్న బెల్ట్ తీసుకొని స్వప్నని లాక్కొని గదిలోకి తీసుకొని వెళ్తుంది. ఏంటి ఇలా లాక్కొని వచ్చావ్ అంటూ కావ్యపై స్వప్న సీరియస్ అవుతుంది. నువ్వు ప్రెగ్నెంట్ అంటూ నాటకం ఆడుతున్న విషయం మర్చిపోయావా అని బెల్ట్ చూపిస్తుంది . ఇంకెన్ని రోజులు ఇంట్లో వాళ్లని ఇలా మోసం చేస్తావ్. నువ్వు చెప్పకుండా నన్ను చెప్పనివ్వుకుండా, నన్ను కూడా ఈ మోసం లో భాగం చేస్తున్నావని కావ్య అంటుంది. నువ్వు ఈ మోసం లో భాగం ఎప్పుడో అయిపోయావని స్వప్న అనగానే.. కావ్య షాక్ అవుతుంది. అవును పెళ్లికి ముందు కూడా నీకు నేను ప్రెగ్నెంట్ కాదన్న విషయం తెలుసు కానీ నువ్వు ఇంట్లో వాళ్లకి చెప్పలేదు కదా అని కావ్యదే తప్పు అన్నట్లుగా స్వప్న మాట్లాడుతుంది.

ఆ తర్వాత ఇప్పుడు అందరికి వెళ్లి నిజం చెప్తానని కావ్య అనగానే.. వద్దు నాకు కొంచెం టైం ఇవ్వు, నేనే ఈ సమస్యని పరిష్కారిస్తానని స్వప్న అడుగుతుంది. సరే ఈ ఒక్కసారి వదిలిపెడుతున్నాను. నువ్వే అందరికి నిజం చెప్పాలని కావ్య చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ కడుపుతోనే ఈ ప్రాబ్లమ్ అబార్షన్ అయిందని అందరిని నమ్మించాలని స్వప్న అనుకుంటుంది. ఆ తర్వాత అందరూ భోజనం చేస్తుంటారు. అనామిక, కళ్యాణ్ ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు.. అప్పు ఎక్కడ కన్పించడం లేదు. నేను వెళ్లి తీసుకొని వస్తానని కనకం వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.