English | Telugu

ఆ పదాలకు అర్థాలా అవి ..సుమకి చాట భాష నేర్పిన ఆలీ!


"ఆలీతో సరదాగా షో"లో సుమ, ఆలీ ఆడియన్స్ ని మస్త్ ఎంటర్టైన్ చేయడానికి వచ్చే వారం రాబోతున్నారు. ఆ న్యూ ఎపిసోడ్ ప్రోమో చూస్తే గనక కొన్ని ఫన్నీ థింగ్స్ నవ్వు తెప్పించేవి గా ఉన్నాయి. "30 రోజుల్లో ఆలీ గారి చాట భాష నేర్చుకోవడం ఎలాగా ? అనే విషయం గురించి తెలుసుకుని రమ్మని పంపించారు " అని సుమ అనేసరికి "ఆలీ నవ్వుతూ అది చాలా కష్టం" అన్నట్టుగా చెప్పారు. "మీరు ఎక్కువగా ఫ్లాన్తర్ పకిడి అంటారు కదా..అంటే ఏమిటి " అని అడిగేసరికి "ఫ్లవర్" అని ఆన్సర్ చేశారు ఆలీ.

"సుమ అంటే ఫ్లవర్ అని తెలుసు ఐతే మీరు చెప్పిన అర్ధం బట్టి సుమ = ఫ్లవర్ = ఫ్లాన్తర్ పకిడినా అయ్యో రామ" అని తల కొట్టుకుని మరీ నవ్వింది సుమ. మరి "జంబల్ హార్ట్ రాజా" అంటే ఏమిటి అని అడిగింది సుమ. "మీ ఆయన పేరు అదే" అన్నారు నవ్వుతూ ఆలీ. ఆయన పేరు జంబల్ హార్ట్ రాజా కాదు కనకాల రాజా అని చెప్పింది సుమ.

"మీరెప్పుడైనా అనుకున్నారా ఇలా హీరో అవుతానని" అని అడిగేసరికి "నాకు రాజబాబు గారంటే ఇన్స్పిరేషన్ ..ఆయనలా కమెడియన్ అవుదామనుకున్నా కానీ హీరో అవుదామని అనుకోలేదు" అన్నారు "మరి షోలే కొన్ని వందల సార్లు చూసారు కదా మరి ధర్మేంద్రలా ట్రై చేద్దామని అనుకోలేదా అని కౌంటర్ వేసింది సుమా.. ఆయనలా కండలు లేవు, అమితాబ్ లా చేయడానికి అంతా హైట్ కూడా లేదు" అని రివర్స్ కౌంటర్ వేశారు ఆలీ.