English | Telugu
సుధీర్ రావాలంటూ సోషల్ మీడియాలో ఫాన్స్ రచ్చ
Updated : Dec 16, 2022
ఏ షో ఐనా సరే స్క్రీన్ మీద ఒక హిట్ పెయిర్ అనేది ఉంటుంది. బుల్లితెర మీద అలాంటి హిట్ పెయిర్ సుడిగాలి సుధీర్-రష్మీ జంట. వీళ్ళు కలిసి షో చేస్తే చాలు దాని రేటింగ్ మాములుగా ఉండదు. ఇక వీళ్ళు అన్ని షోస్ తో పాటు "ఢీ" లో కూడా వచ్చి ఎంటర్టైన్ చేస్తూ ఈ షోని వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. ఢీ ప్రోగ్రామ్ లో మొదట రవి-లాస్య టీమ్ లీడర్స్ గా ఉండేవారు. ఆ పెయిర్ కూడా స్క్రీన్ మీద ఎంతో సక్సెస్ అయ్యింది. తర్వాత వాళ్ల ప్లేసులో సుడిగాలి సుధీర్-రష్మీతో పాటు యాంకర్ గా ప్రదీప్ ఉండేసరికి ఆ ఎంటర్టైన్మెంట్ డోస్ మాత్రం ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా ప్రతీ వారం సరదాసరదాగా సాగేది. సుధీర్ చేసే కామెడీ కోసమే ఆడియన్స్ వెయిట్ చేసేవారు. అలాంటి సుధీర్ కొన్ని సీజన్స్ నుంచి ఢీ షోకు దూరమైపోయాడు. తర్వాత ఆది-ప్రదీప్ ఎంటర్టైన్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ సుధీర్ తో ఆది మ్యాచ్ అయ్యే పరిస్థితి ఆడియన్స్ కి కనిపించలేదు. ఎందుకంటే ఆది కామెడీ ఓకే కానీ బాడీ లాంగ్వేజ్ మాత్రం కాస్త హెడ్ వెయిట్ అన్నట్టుగా చేస్తుంటాడు, కానీ సుధీర్ బాడీ లాంగ్వేజ్ మాత్రం కామన్ మాన్ లా కనిపిస్తూ అలరిస్తూ ఉంటాడు అంటున్నారు నెటిజన్స్.
ఆది ఎంతసేపు తాను తప్ప వేరే వారు లేరు అన్నట్టుగా డైలాగ్స్ వేస్తూ ఉంటారు. ఆయన పంచ్ వేస్తే వేరే వాళ్ళు ఫీల్ అవ్వాల్సిందే తప్ప ఆయన మీద అసలు పంచ్ అనేది వేయకూడదు అనే ఒక రూల్ పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఎలిమెంట్స్ ఉండేసరికి ఆడియన్స్ కూడా సుధీర్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక లేటెస్ట్ గా ‘ఢీ 15’ సీజన్ స్టార్ట్ చేశారు. కొన్ని సీజన్లుగా ఈ షోకు దూరమైన శేఖర్ మాస్టర్ ని మళ్లీ తీసుకొచ్చారు. మరి సుధీర్ ని కూడా షోకు తీసుకురండి అని నెటిజన్స్ కామెంట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మరి మల్లెమాల టీమ్ నెటిజన్స్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సుధీర్ ని షోకి తీసుకొస్తారా ? చూడాలి