English | Telugu

ఎవరెన్ని పూజలు చేసినా లాస్ట్ లో మమ అనాల్సింది సుమ


సుమ అడ్డా నెక్స్ట్ వీక్ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి "లవ్ మౌళి" మూవీ టీమ్ నుంచి నవదీప్, పంఖురి గిద్వాని, భావన, కిరణ్ వచ్చారు. ఇక ఈ షోలో సుమ గురించి ఫుల్ పాజిటివ్ కామెంట్స్ చేశారు ఈ మూవీ టీమ్. "జనరల్ గా సినిమా వాళ్ళు మొత్తం పూర్తయ్యాక పెద్దమ్మ గుడి దగ్గరకు వెళ్లి ఫంక్షన్ చేస్తారు... తర్వాత సుమమ్మ గుడికి రావాల్సిందే" అని కిరణ్ చెప్పేసరికి "ఎవరు ఎన్ని పూజలు చేసినా లాస్ట్ లో మమ అనాల్సింది సుమ" అంటూ నవదీప్ అద్భుతమైన డైలాగ్ అంటూనే "మొన్న చిరంజీవి గారి కోటు కొట్టేయడమే నచ్చలేదు" అని నవదీప్ చెప్పి సుమనే ఆ కోటు కొట్టేసిందని తెలిసి కొంచెం ఫీల్ అయ్యాడు.

ఇక ప్రోమో స్టార్టింగ్ లో ప్రోగ్రాం లింక్ ని నవదీప్ చెప్పేసాడు "వెల్కమ్ టు సుమా అడ్డా..ఈరోజుకు ఇది మౌళి గాడి అడ్డా" అని చెప్పాడు. "మౌళి మీరు ప్రేమను వెతుకుతూ తిరుగుతున్నారని అర్ధమయ్యింది..." అని సుమా అడిగేసరికి "చిన్నప్పటినుంచి వెతుకుతూనే ఉన్నాను..దొరుకుతున్నట్టే దొరుకుతుంది మళ్ళీ దొరకట్లేదు" అన్నాడు నవదీప్. "అదేంటి మా షోనే లవ్వు...మా షో అంటేనే ప్రేమ" అని సుమా చెప్పింది. "అబ్బాయిలు అమ్మాయిలను ఎలా సెలెక్ట్ చేస్తారు" అంటూ సుమ నవదీప్ ని అడిగేసరికి తెగ సిగ్గు పడిపోయాడు పాపం. "టైం ఐనా, గర్ల్ ఫ్రెండ్ ఐనా ఎవరి కోసమూ ఆగదు" అని సుమా చెప్పేసరికి "నేనస్సలు ఆగను" అన్నాడు నవదీప్. ఇక భావనతో మాట్లాడింది సుమ "ఐనా మీరు సినిమాలో మేనేజర్ కదా..లాస్ట్ లో ఇంకేదో షాట్ చూసానే" అనేసరికి "నేనొక్కదాన్నే ప్రపంచానికి, ఆయనకు లింక్" అని చెప్పింది. వెంటనే సుమ అందుకుని "నాలాగే మీరు కూడా ..నేను కూడా అంతే ప్రోగ్రాంకి, ఆడియన్స్ కి లింక్" అని చెప్పింది. ఇక ప్రోమో చివరిలో పంఖూరి అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసి అదరగొట్టింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.