English | Telugu
"ఫ్యామిలీ స్టార్స్" షోతో హోస్ట్ గా సుడిగాలి సుధీర్ రిఎంట్రీ
Updated : May 15, 2024
బుల్లితెర మీద సుడిగాలి సుధీర్ కి ఎంతో క్రేజ్ ఉంది..జబర్దస్త్ యాంకర్ గా ఎంతో పాపులారిటీ సంపాదించి మూవీస్ లో హీరోగా కూడా నటించాడు. కొంతకాలంగా సుధీర్ ఖాళీగా ఉంటున్నాడు. జబర్దస్త్ గుడ్‌బై చెప్పాక ఈటీవీ స్పెషల్ ఈవెంట్స్‌లో కొన్ని సార్లు కనిపించాడు. టీవీ షోలకు దూరంగా ఉంటున్న సుధీర్ మళ్ళీ అభిమానుల కోరిక మేరకు హోస్ట్‌గా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. త్వరలో ఈటీవీలో ఓ టీవీ షో చేయబోతున్నాడు. ఈ షోకు "ఫ్యామిలీ స్టార్స్" అనే టైటిల్ పెట్టారు. ఈ న్యూ షో ప్రోమో రీసెంట్ గా రిలీజయ్యింది. "ఆటచూస్తావా" అంటూ ఈ ప్రోమోలో సుధీర్... మహేష్‌బాబు డైలాగ్ కి లిప్ సింక్ ఇవ్వడం హైలైట్‌గా ఉంది. "ది ఎంటర్‌టైనర్ ఈజ్ బ్యాక్" అంటూ సుధీర్ రిఎంట్రీని ఉద్దేశిస్తూ పెట్టిన క్యాప్షన్ కనిపిస్తోంది.
2013 ఫిబ్రవరిలో జబర్దస్త్ కంటెస్టెంట్‌గా జర్నీ స్టార్ట్ చేసిన సుధీర్ 2022 మే వరకు కంటిన్యూగా చేసాడు. తర్వాత సినిమాలపైనే ఫోకస్ పెట్టాడు. సాఫ్ట్‌వేర్ సుధీర్, గాలోడు, వాంటెడ్ పండుగాడు, కాలింగ్ సహస్ర వంటి మూవీస్ లో చేసాడు. ఐతే ప్రస్తుతానికి మూవీ ప్రాజెక్ట్స్ కూడా ఏమీ లేకపోవడంతో ఇటు ఈటీవీ షోకి అటు ఆహా ప్లాట్ఫారం మీద సర్కార్ సీజన్ 4 హోస్ట్ గా చేస్తున్నాడు. సుధీర్ కామెడీ టైమింగ్ , తన మీద ఎవరు జోక్స్ వేసిన స్పోర్టివ్ గా తీసుకునే మనస్తత్వం, ఎంత ఎదిగినా ఆటిట్యూడ్ చూపించకపోవడం వంటి లక్షణాలు సుధీర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించిపెట్టాయి. ఐతే అభిమానుల కోరిక మేరకు ఇక నుంచి బుల్లితెర మీద చేస్తూనే మూవీస్ మీద కూడా ఫోకస్ పెట్టబోతున్నాడన్న విషయం తెలుస్తోంది.