English | Telugu

చుట్ట తాగడం వలన కాన్సర్ వస్తుందా రాదా 

చుట్ట తాగడం వలన కాన్సర్ వస్తుందా రాదా 

 


డ్రామా జూనియర్స్ ప్రతీ వారం ఫుల్ ఫన్నీగా ఉంటోంది. ఇక శనివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో సుధీర్ కూడా ఒక స్కూల్ పిల్లాడి గెటప్ లో వచ్చి ఫుల్ ఎంటర్టైన్ చేసాడు. రోజా టీచర్ గా వచ్చింది. గొప్ప సైంటిస్టుల పేర్లు చెప్పండి అని రోజా అడిగేసరికి  "మా తాత మేడం" అన్నాడు సుధీర్. "ఎం కనిపెట్టాడు" అని రోజా అడిగేసరికి "చుట్ట తాగడం వలన కాన్సర్ వస్తుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు కదా మేడం అది నిజమో కాదో అని మా తాతే కనిపెట్టాడు మేడం" అన్నాడు. అంతే రోజా షాకైపోయింది.

"గాంధీ గారి మీద వ్యాసం రాయమన్నాను కదా" అని రోజా అడిగేసరికి సుధీర్ 100 నోటు చూపించాడు. "ఇదేంట్రా డబ్బులు మీద రాసావ్" అని అడిగింది. "మీరే కదా మేడం గాంధీ తాత మీద రాయమన్నారు" అందుకే అనేసరికి రోజాకి ఏమనాలో అర్ధం కాలేదు. ఒక స్కిట్ లో ఒక కుర్రాడు సుధీర్ ని చూసి నవ్వాడు.."ఎందుకు అంత నవ్వుతున్నారు... నేనెవరో మీకు తెలుసా" అన్నాడు సుధీర్. మీరు తెలియక పోవడం ఏంటి "గూగుల్ లోకి వెళ్లి నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు అని కొడుతుంటే మీ ఫొటోలే వస్తున్నాయి..ఐనా అందరికీ సాధ్యమా అండి చి పోరా అనుకునే స్థాయికి రావడం  " అని ఆన్సర్ చెప్పేసరికి అందరూ నవ్వేశారు. వీళ్ళు పిల్లలైనా అన్న రేంజ్ లో స్కిట్స్ చేస్తుంటే ప్రతీ ఒక్కరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు.