English | Telugu

ఇండస్ట్రీలో కొందరు నన్ను బెదిరించారు

జబర్దస్త్ తన్మయ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఫుల్ కామెడీ చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ ఆమె ఒక ఇంటర్వ్యూ చేసింది. అందులో తన జీవిత కష్టాలన్నీ చెప్పుకొచ్చింది. అసలు తానూ ఎలా ట్రాన్ఫర్మ్ కావాల్సి వచ్చింది...అప్పుడు ఎదుర్కున్న కష్టాలు, మాటల దాడుల గురించి చెప్తూ బాధపడింది. ఐతే ఇంకో ముఖ్య విషయాన్ని కూడా షేర్ చేసుకుంది. లాస్ట్ ఇయర్ ఆగస్టు లో తన్మయ్ ఫాదర్ కన్నుమూశాడు. "ఐతే ఆయన చనిపోయే ముందు రోజు రాత్రి శ్రీదేవి డ్రామా కంపెనీ షూటింగ్ ఐపోయాక నాన్నతో వీడియో కాల్ లో మాట్లాడాను. ఆ తర్వాత రోజు ఉదయం 11 గంటలకు నాన్న చనిపోయాడు అన్న న్యూస్ వచ్చింది.

ఆ టైములో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీలేదు.ఎం చేయాలో తెలీలేదు. షాక్ లో ఉండి ఇమ్మానుయేల్ కి ఫోన్ చేసాను.అమ్మ షూటింగ్ లో ఉన్నాను లేదంటే వచ్చేవాడిని అని చెప్పాడు. తర్వాత నూకరాజుకు ఫోన్ చేశా. ఎక్కడి పనులు అక్కడ వదిలిపెట్టి, షూటింగ్ ని కూడా వదిలేసి కార్ వేసుకుని వచ్చేసాడు. నేను ఏడుస్తూనే ఉన్నాను. హైదరాబాద్ లో నా చెయ్యి పట్టుకున్నవాడు మా నాన్న దగ్గరకు వెళ్లేంత వరకు నా చెయ్యి వదల్లేదు. నాకు ధైర్యం చెప్తూనే ఉన్నాడు. నాకు తెలిసి నాకు హెల్ప్ చేసిన వ్యక్తి నూకరాజు ఒక్కడే. డబ్బులుపరంగా కూడా ఎవరూ హెల్ప్ చేయలేదు. ఎవరి లైఫ్ వాళ్లకు ఉంటుంది. నేను రెండేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండడానికి కారణం కొంతమంది పెద్ద హోదాలో ఉన్నవాళ్లు నన్ను కొట్టి, తిట్టి, నన్ను బెదిరించారు...ఇవన్నీ తెలిస్తే మా అమ్మా వాళ్ళు బాధపడతారని నేను ఎప్పుడూ చెప్పలేదు." అంటూ తన్మయ్ తన జీవితంలో పడిన కష్టాలని చెప్పుకొచ్చింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.