Read more!

English | Telugu

నా షార్ట్స్ కరీదు 20 రూపాయలు.. దాని పేరు కుకువాక్వ

ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఫ్రెష్ సింగర్స్ తో పోటా పోటీగా జరుగుతోంది. ఈ వారం "కోటి ఉగాది ఛాలెంజ్" పేరుతో కోటి కంపోజ్ చేసిన సాంగ్స్ పాడి వినిపించారు కంటెస్టెంట్స్. ఇక మానస వచ్చి "యముడికి మొగుడు" మూవీ నుంచి "అందం హిందోళం" పాడి వినిపించింది. ఈ సాంగ్ గురించి కోటి తన గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. "మేము మెగాస్టార్ కి చేసిన ఫస్ట్ సాంగ్ ఇది. ఈ సాంగ్ చేసాక రాజ్, నేను ఆ క్యాసెట్ ని మెగాస్టార్ కి పంపించాం. కానీ అటు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అసలు ఈ సాంగ్ పెట్టుకుంటారా లేదా అని భయపడుతూ ఉండగా ఆ రోజు సాయంత్రం పెద్ద బొకే వచ్చింది.

అందులో "వెరీ మచ్ ఇంప్రెస్డ్" అని చిరంజీవి గారు సైన్ చేసి పంపించారు. ఇంకో విషయం ఏమిటి అంటే ఈ సాంగ్ కి కోరస్ అంతా కూడా థమన్ వాళ్ళ అమ్మ సావిత్రి పాడారు. ఆమె నా దగ్గర పర్మనెంట్ కోరస్ సింగర్" అని చెప్పారు కోటి. ఇక ఇదే పాటకు సంబంధించిన జ్ఞాపకాలకు థమన్ కూడా చెప్పుకొచ్చారు "కోటి గారంటే ఇన్స్టెంట్ పేమెంట్. ఇలా కోరస్ పాడేసిన వెంటనే వోచర్ మీద సైన్ చేసి డబ్బులు ఇచ్చేసేవారు. అప్పుడు మా అమ్మ డబ్బులు తీసుకుంటుంటే నాకు ఏమి కొనిస్తుందా అని ఆలోచిస్తున్నా. 1998 లో నేను అప్పుడు మా అమ్మతో రికార్డింగ్ కి వెళ్లాను. అలా నేను బస్సు లో వెళ్తున్నంత సేపు మా అమ్మ పాడిన ఆ కోరస్ నా మైండ్ లో తిరుగుతూనే ఉంది. అలా ఇంటికి వెళ్లేంతవరకు పాడుతూనే ఉండేసరికి..నా వాయిస్ అంత నచ్చిందా అని మా అమ్మ అడిగి చాలా హ్యాపీగ ఫీలయ్యింది. అలా ఇద్దరం పాడుకుంటూ వెళ్లాం. బస్సు దిగాక ఒక స్టోర్ కనిపించింది. అక్కడ 20 రూపీస్ పెట్టి నాకు షార్ట్స్ కొనిచ్చింది మా అమ్మ.  

ఆ షార్ట్స్ వేసుకున్నప్పుడల్లా ఆ సాంగ్ పాడుతూనే ఉండేవాడిని. అందుకే ఆ షార్ట్స్ కి కుకువకుకువ అని పేరు పెట్టుకున్నా. అదే టైములో మా నాన్న చనిపోయారు. అలా నా చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఫస్ట్ టైం నేను కోటి గారికి ఫోన్ చేసి ఏదైనా పని ఉంటే ఇవ్వండి..మీ టీంలో జాయిన్ అవ్వాలని ఉంది అని చెప్పా. నాకు ఎవరికీ ఫోన్ చేయాలనీ అనిపించలేదు. ముందు బాలు గారికి చేసాను. తర్వాత కోటి గారికి చేసాను. బాలు గారు నన్ను కచేరీలు పిలిచారు. కోటి గారు నన్ను హలో బ్రదర్ మూవీకి పిలిచి నాతో సాంగ్ చేయించారు. అది చాలా గ్రేట్ ఫీలింగ్." అని చెప్పుకొచ్చారు.