English | Telugu
ఎవరితో పడితే వాళ్లతో డాన్స్ చేయడం ఇష్టం లేదు
Updated : Nov 3, 2023
శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో ఆది బేస్డ్ ప్రోగ్రాంగా రాబోతోంది. "ఆది కల్యాణ మండపం" పేరుతో ఈ షో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇక ఈ షోకి సిరి హన్మంత్, బేబీ మూవీ ఫేమ్ విరాజ్ అశ్విన్ కూడా ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళు వీళ్ళ డాన్స్ తో మెస్మోరైజింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక ఈ షోకి వచ్చిన సెలబ్రిటీస్ అంతా కూడా వాళ్ళ వాళ్ళ ఫస్ట్ జాబ్స్ గురించి చెప్పుకొచ్చారు. అలాగే బ్యాక్ డ్రాప్ లో వాళ్ళ పిక్స్, వీడియోస్ కూడా ప్లే చేసి చూపించారు.
ఇలా ఎవరికీ వాళ్ళు వాళ్ళ హిస్టరీ చెప్పుకున్నాక ఆది ఎంట్రీ ఇచ్చాడు. "ఇప్పుడు నేను ఈ బౌల్ లోంచి ఇద్దరి పేర్లు తీస్తాను. వాళ్ళు స్టేజి మీదకు వచ్చి ఒక రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ పెర్ఫార్మ్ చేయాలి" అని చెప్పాడు. "కావ్య, శ్రీకర్" అని ఆది పేర్లు చదివేసరికి మధ్యలో నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. "కాదు కాదు ఎవరి పార్టనర్ వాళ్ళతోనే డాన్స్ చేస్తేనే బెటర్ మేం కలిసి వస్తే ఇంకెవరితోనో డాన్స్ ఏమిటి" అన్నాడు. "ఎవరు పడితే వాళ్ళు అంటే నీ ఉద్దేశం ఏమిటి" అంటూ శ్రీకర్ నిఖిల్ మీద ఫైర్ అయ్యాడు.
"నాతో వచ్చిన పార్టనర్ నాతో డాన్స్ చేయాలి వేరేవాళ్లతో కాదు" అని ఉద్దేశం అన్నాడు నిఖిల్. "కేవలం సాంగ్ కోసమే కదా. దానికి ఎందుకు సీరియస్ అవుతున్నావు" అన్నాడు శ్రీకర్. "ఇది కేవలం కంటెంట్ మాత్రమే" అని రష్మీ సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. కానీ నిఖిల్ మాత్రం నో అని చెప్పేసాడు. "నిఖిల్ నీకేంటి ప్రాబ్లెమ్" అని శ్రీకర్ ని అడిగేసరికి నిఖిల్ వెళ్లి పూలదండలు తెచ్చి కావ్య మేడలో వేసేశాడు. కావ్య నిఖిల్ ని రింగ్ పెట్టేసింది. ఇదంతా ఏమిటా అన్నట్టుగా చూసి షాకయ్యాడు ఆది.