English | Telugu

పెళ్లిని కామెడీగా మార్చేసిన 'శ్రీ‌దేవి డ్రామా కంపెనీ'!

రీసెంట్ గా యాంకర్ వర్ష చేతిలో తాళిబొట్టు పెట్టుకొని జూలై 4న బిగ్ అనౌన్స్‌మెంట్‌ అంటూ ఓ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన నెటిజన్లు పబ్లిసిటీ కోసం ఇలా చేస్తుందని కొట్టిపారేశారు. మరికొందరు వర్ష పెళ్లి చేసుకోబోతుందంటూ పోస్ట్ లు పెట్టారు. అయితే చాలామంది అనుకున్నట్లుగా ఇదొక చీప్ పబ్లిసిటీ ట్రిక్ అని తేలిపోయింది. 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను విడుదల చేశారు.

ఇందులో యాంకర్ వర్ష.. కమెడియన్ ఇమ్మాన్యుయేల్ ను పెళ్లాడుతూ కనిపించింది. వర్ష-ఇమ్మాన్యుయేల్ పెళ్లిపీటలపై ఒకరి పక్కన మరొకరు కూర్చొని తెగ సిగ్గుపడుతూ కనిపించారు. ఇంత‌కు ముందు సుధీర్-ర‌ష్మిలకు పెళ్లి చేసిన 'అహ నా పెళ్లంట‌', ఉగాది స్పెష‌ల్ ఈవెంట్‌ మంచి రేటింగ్స్ తెచ్చుకుంది.. అది మ‌ల్లెమాల వారిదే. అదే త‌ర‌హాలో ఇప్పుడు వర్ష-ఇమ్మాన్యుయేల్ లకు కూడా పెళ్లి చేసేసారు.

ఇలా అందరికీ పెళ్లిళ్లు చేస్తూ మ‌ల్లెమాల సంస్థ‌ పెళ్లిళ్ల కళ్యాణ మండపంలా మారిందంటూ కామెంట్స్ చేస్తూ నెటిజన్లు. ఇంత దిగజారుడు ప్రమోషన్స్ అవసరమా..? అంటూ నిర్వాహ‌కులను తిట్టిపోస్తున్నారు. పెళ్లి అనే ప‌విత్ర బంధాన్ని కామెడీతో హేళన చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా కొత్తగా ఆలోచించి ప్రోగ్రామ్స్ చేయమని సలహాలు ఇస్తున్నారు.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...