English | Telugu

మేకప్ లేకపోతే ఇలా ఉంటుంది అనసూయ ముఖం!!

యాంకర్ అనసూయకి బుల్లితెరపై ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. పలు వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఎంతమంది తనను ట్రోలింగ్ చేసినా పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటుంది. తాజాగా అనసూయ తన మొహంపై వచ్చిన మొటిమల గురించి చెబుతూ కొన్ని కామెంట్స్ చేసింది.

అనసూయ అందానికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పుడూ మేకప్‌తోనే కనిపిస్తుంటుంది. మేకప్ లేకుండా చాలా అరుదుగా కెమెరా ముందుకు వస్తుంటుంది. తాజాగా ఆమె మేకప్ లేకుండా నెటిజన్ల ముందుకు వచ్చింది. తనకు మొహం నిండా పింపుల్స్ వచ్చాయని దానికి కారణాలు చెప్పుకొచ్చింది.

పింపుల్స్ రావడం అనేది ఓ సమస్య అని అందరూ ఫీల్ అవుతారని.. మరీ ముఖ్యంగా అమ్మాయిలు.. అని చెప్పింది. ఈ మధ్యకాలంలో అబ్బాయిలు కూడా ఫీలైపోతున్నారని చెప్పింది. కానీ అది సాధారణమైన విషయమని.. మన శరీర ఉష్ణోగ్రత సరిగ్గా పని చేస్తుందనే దానికి గుర్తు అని చెప్పుకొచ్చింది. తనకు ఈ పింపుల్స్ ఎందుకు వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేశానని.. మామిడి పండ్లు తినడం వల్లే ఇలా జరిగిందని చెప్పింది. అలా అని తినకుండా ఉండలేమని.. ఈ ఒక్క సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి.. మ్యాంగో లవర్స్ ఈ విషయంలో మొహమాటపడకండి.. నేను మీతో ఉన్నానంటూ చెప్పుకొచ్చింది.

Sanjana Gets Zero Points: జీరోగా సంజన.... హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో జైల్లోకి!

బిగ్ బాస్ సీజన్-9 చివరి దశకి వచ్చింది. సోమవారం రోజు నో నామినేషన్ అని బిగ్ బాస్ చెప్పాడు. కొన్ని పాయింట్స్ గల బాక్స్ లని గార్డెన్ ఏరియాలో పెట్టాడు. అందులో జీరో నుండి రెండున్నర లక్షల వరకు నెంబర్ గల బాక్స్ లు ఉంటాయి. ఎన్ని పాయింట్స్ కి ఎవరు అర్హులో వారికి ఆ పాయింట్స్ గల బాక్స్ ఇవ్వాలి.. పై నుండి ఎవరు అయితే ముందుగా బాల్ పట్టుకుంటారో వాళ్ళకే మనీ పాయింట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇచ్చే పాయింట్స్ ని హౌస్ మేట్స్ ఇద్దరు అంగీకరించాలి.. కనీసం ఇద్దరు కూడా అంగీకరించకపోతే ఆ పాయింట్స్ అతనికి రద్దు అవుతాయని బిగ్ బాస్ చెప్తాడు...