English | Telugu

ఆది - రష్మీ ప్రేమకు ఇన్నేళ్ళుగా అడ్డుపడిన సుధీర్


జబర్దస్త్ టైం నుంచి మనం చూస్తే ఆన్ స్క్రీన్ జోడీగా బాగా క్లిక్ ఐన పెయిర్ ఎవరైనా ఉన్నారంటే అది రష్మీ - సుధీర్ జోడి మాత్రమే. కార్తీక దీపం సీరియల్ జోడి తరువాత జబర్దస్త్ జోడి బాగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది. ఐతే అదంతా ఆన్ స్క్రీన్ మీద తప్ప అసలు బయట ఎవరికీ వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటాం అని కూడా చాలా సార్లు చెప్పారు. కానీ ఆడియన్స్ ఊరుకోలేదు. సుధీర్ - రష్మీ పెళ్లి చేసుకుంటే చూడాలని అనుకునేవాళ్లే ఎక్కువగా ఉండేవాళ్ళు. ఐతే తరువాత కాలంలో ఇద్దరూ వేరు వేరు షోస్ చేసుకుంటూ దూరమైపోయారు.

ఐనా కానీ వీళ్ళ జోడి మాత్రం ఎవర్ గ్రీన్ అని చెప్పొద్దూ. బుల్లితెర జోడి అంటే వీళ్ళే గుర్తొస్తారు. ఐతే ఇప్పుడు ఆది తన మనసులో అసలు విషయాన్ని బయటపెట్టాడు. రష్మీ సుధీర్ మీద మనసు పడిందో లేదో కానీ ఆది మాత్రం రష్మీ మీద మనసు పడినట్టు తన కామెంట్స్ ద్వారా చెప్పకనే చెప్పాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమోలో ఈ విషయం బయట పెట్టాడు. రష్మీని కుర్చీలో కూర్చోబెట్టి నెమలి ఈకల్తో ఆమెను సవరదీస్తూ "రష్మీ నాకు వాడు తొమ్మిది సంవత్సరాలు అడ్డుపడ్డాడు.." అనేసరికి అందరూ షాకైపోయారు. అంటే దీన్ని బట్టి రష్మీ అంటే ఆదికి ఇష్టం అనే విషయం తెలుస్తోంది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.