English | Telugu

నరేశ్‌కి డైపర్లు ఇస్తానన్న బామ్మ!

శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక రాబోయే ఎపిసోడ్ అంతా బోనాల జాతర స్పెషల్ ఎపిసోడ్ గా ఆడియన్స్ ని అలరించేందుకు సిద్దమయ్యింది. బుల్లితెర నటులు, కమెడియన్స్ అంతా కూడా ఈ ఎపిసోడ్ లో కనిపించబోతున్నారు. ఈ షోకి వచ్చిన ఒక బామ్మని నాటీ నరేష్ ఆటపట్టిందామనుకుంటాడు. కానీ ఆ బామ్మ సై అంటే సై అంటూ కౌంటర్ ఇచ్చి పడేస్తుంది. "ఏ బామ్మా నీకు ఫన్ కావాలన్నా, కామెడీ కావాలన్నా నన్ను అడుగు" అంటాడు నరేష్. "నీకు డైపర్లు కావాలంటే నన్నడుగు" అంటూ కౌంటర్ డైలాగ్ వేస్తుంది బామ్మ. అంతే స్టేజి మీద ఒక్కసారిగా నవ్వులే నవ్వులు.

ఇక ఈ షోకి ఇంద్రజ రీఎంట్రీ ఇచ్చి అందరిని ఆనందపరిచింది. నెటిజన్స్ కూడా ఇంద్రజ ఎంట్రీ పై చాలా బెస్ట్ కామెంట్స్ చేశారు. తర్వాత పవన్ క‌ళ్యాణ్, బాలయ్య డూప్స్ వచ్చి వర్ష, ఫైమాతో కలిసి సూపర్ సాంగ్స్ కి డ్యాన్సులు వేసి స్టేజిని ఇరగొట్టేసారు. ఇక ఈ షోకి 'కార్తికేయ 2' జంట‌ అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ వచ్చారు. "ఇలాంటి ఒక జాతరలో చిన్నప్పుడు నా మరదలు తప్పిపోయింది" అంటాడు నిఖిల్. "నా బావ కూడా మిస్ అయ్యాడు" జాతరలో అంటుంది అనుపమ.

అనుపమ డైలాగ్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఇమ్ము స్టేజి మీదకు వచ్చి "దొండకాయ, బెండకాయ, అనుపమ నా గుండెకాయ్.. నేను అనుపమ బావను" అంటూ వస్తాడు. ఆ తర్వాత అనుపమ "అలా నువ్వు చూస్తే చాలు" అంటూ తన మూవీలోని సాంగ్ పాడి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇక అనుపమతో కలిసి కమెడియన్స్ అంతా "రాను రానంటూ చిన్నదో" అనే పాటకు డాన్స్ చేసేస్తారు. ఇలా ఈ ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీ అలరించనుంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.