English | Telugu
నాలో కరెంటు ఉంటే కదా షాక్ కొట్టేది!
Updated : Jul 28, 2022
'ఢీ 14 డ్యాన్సింగ్ ఐకాన్' ప్రతీ వారం కామెడీ స్కిట్స్ తో, ప్రాంక్స్ తో బాగా ఎంటర్టైన్ చేస్తోంది. ఈ వారం ఎపిసోడ్ కూడా ఫుల్ మస్తీ చేసిందనే చెప్పొచ్చు. ఈ ఎపిసోడ్ మొత్తం కొరియోగ్రాఫర్స్ రౌండ్ అన్నమాట. "షర్టులు, ప్యాంట్లు, మోడరన్ డ్రెస్సులు వేసుకున్న గ్రహాంతరవాసుల్ని చూద్దామనుకుంటున్నారా?" అంటూ ప్రదీప్ అనేసరికి హైపర్ ఆది స్టేజి మీద ఎంట్రీ ఇస్తాడు. ఆది చాలా డల్ గా వచ్చేసరికి.. "ఎందుకంత డల్ గా ఉన్నావ్?" అనడిగాడు ప్రదీప్. "బట్టలషాపులో చిన్న గొడవ. ఈ షాప్ లో చూసినన్నిటిని ట్రయిల్ వేసుకోవచ్చని చెప్పాడు కదా అని నేనేమో సేల్స్ గర్ల్ ని చూశా" అన్నాడు ఆది. గర్ల్ దగ్గర బీప్ పడుతుంది.
"అందుకే నాకు, షాప్ ఓనర్‌కు గొడవయ్యింది. నా విషయం వదిలేయ్. ఇంకో ఇద్దరు గ్రహాంతరవాసుల్ని పిలువ్" అని ఆది అనేసరికి రవికృష్ణ, నవ్యస్వామి వచ్చేస్తారు స్టేజి మీదకు. "రవీ! నేనైతే నిన్ను లైఫ్ లో వదలను" అంది నవ్య. వెంటనే ఆది అందుకుని "ఎందుకంటే నీలాంటి బకరా మళ్ళీ దొరకడు కదా" అంటాడు. వెంటనే రవికి కోపం వచ్చేస్తుంది. "ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావ్? నా వేల్యూ నీకు తెలియట్లేదు. నాకు బెంగుళూరు నుంచి కూడా ఫాన్స్ ఉన్నారు తెలుసా?" అన్నాడు ఆదితో. "ఐతే అక్కడికే వెళ్ళు" అని చెప్పాడు ఆది. తర్వాత శ్వేతా నాయుడు టీమ్ వచ్చి డాన్సులు వేశారు.
తర్వాత నవ్య స్వామి చేయి పట్టుకున్నాడు ఆది. "ఏంట్రా కరెంటు షాక్ ఏమీ రావట్లేదు" అన్నాడు ..'నాలో కరెంటు ఉంటే కదా షాక్ కొట్టేది" అంటూ తన మీద తాను జోక్ వేసుకుంది నవ్య. అందరూ నవ్వేశారు ఆ జోక్ కి."హా.. ఆది! మర్చిపోయాను. రేపు నాతో పాటూ పార్కుకు రావా?" అని అడిగింది నవ్య. "ఎందుకు?" అని ఆది అడిగేసరికి, "ఎప్పుడూ ఒక్కదానివే వస్తున్నావ్, ఎవరో ఒక ఎదవను తీసుకురావచ్చు కదా.. అని వాచ్‌మన్ అడుగుతున్నాడు" అంటుంది.ఆ మాటకు ఆది షాక్ ఐపోయి "ఏం పంచురా?" అన్నాడు. "నువ్వే కదరా రాసింది" అంటూ కౌంటర్ వేసేసింది నవ్య. ఇలా ఈ వారం ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైన్ చేసేసింది.