English | Telugu
వర్షంలో హనీమూన్ అనగానే ఎగబడతారు!
Updated : Jul 28, 2022
బుల్లితెర మీద ప్రసారమవుతున్న షోస్ కి సెన్సార్ లేకపోయేసరికి ముద్దుల ఎపిసోడ్ లు హద్దులు దాటుతున్నాయి. అసలే వర్షాకాలం మొదలయ్యింది. ఇలాంటి వర్షాకాలాన్ని కూడా స్టార్ మా కాష్ చేసుకోవడానికి సిద్ధమైంది. అందుకే చల్లని వాతావరణంలో హీట్ పుట్టించే సీజనల్ ఎపిసోడ్స్ కి పెద్ద పీట వేస్తోంది. ఇక ఇప్పుడు 'ఈ వర్షం సాక్షిగా' పేరుతో ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఒక హాట్ షోని ప్రసారం చేయబోతోంది. ఇందులో నిరుపమ్, మంజుల, అంబటి అర్జున్, సుహాసిని, రవికృష్ణ, నవ్యస్వామి, నిఖిల్, కావ్య, మానస్, కీర్తి, శ్రీముఖి, అవినాష్ జంటలు వర్షంలో రొమాన్స్ చేయడానికి సిద్ధమైపోయారు.
"మా నిఖిల్-కావ్య వచ్చారు.. మీ మధ్య ఏమన్నా ఉందా అంటే తలపట్టారు.. హనీమూన్ అనగానే ఎగబడ్డారు" అంటూ అవినాష్ నిఖిల్, కావ్య మీద సెటైర్ వేశాడు. తర్వాత సెనగపిండితో బజ్జీలు వేసే టాస్క్ లో నిరుపమ్, మంజుల జంటగా, అర్జున్, సుహాసిని జంటగా వచ్చారు."ఎందుకో ఈ పోటీలో డాక్టర్ బాబు గెలుస్తాడనిపిస్తోంది ఎందుకంటే నాలుగేళ్లు వంటలక్కతో కలిసి చేసాడుగా" అంటూ అర్జున్‌డబుల్ మీనింగ్ డైలాగ్ ఒకటి వేశాడు.
"ఏ ఏ.. ఎం చేశాడు" అంటూ అవినాష్ అడిగేసరికి "వంటలు చేసాడయ్యా" అన్నాడు అర్జున్. "ఈ పోటీలో ఎలాగైనా గెలవాలనే పట్టుదల నీలో కనిపిస్తోంది అర్జున్" అన్నాడు నిరుపమ్. "పట్టుదలైనా, పట్టుకోవడమైన నీ తర్వాతే" అంటూ రివర్స్ డైలాగ్ వేశాడు అర్జున్. ఇక ఫైనల్ లో అవినాష్ కి శ్రీముఖి ముద్దిస్తున్నట్టుగా చూపించి ప్రోమో కట్ చేశారు. 'ఈ వర్షం సాక్షిగా' ఫుల్ రొమాన్స్ అంటూ సరికొత్త ఎపిసోడ్ ఈ ఆదివారం ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది.