English | Telugu
నీలాంబరిలా నా ఎలిమినేషన్ ని చూసుకుని బాధపడ్డా...
Updated : Dec 15, 2022
"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" లాస్ట్ వీక్ ఎపిసోడ్ కి బిగ్ బాస్ సీజన్ 6 నుంచి కంటెస్టెంట్స్ వచ్చి ఎంటర్టైన్ చేశారు. ఇక శ్రీముఖి వీళ్లందరితో రకరకాల గేమ్స్ అవీ ఆడించింది. ఇక తర్వాత త్వరలో పెళ్లి చేసుకోబోతున్న కొత్త పెళ్లి కూతురు నేహాతో ఒక సాంగ్ కి డాన్స్ చేయించింది. ఇక ఫైనల్ గా బిగ్ బాస్ హౌస్ లో గీతూ ఏడ్చిన విషయం గురించి చెప్తూ శ్రీముఖి తన ఫీలింగ్ గురించి అడిగేసరికి అప్పటివరకు బాగా జోష్ తో గేమ్స్ ఆడి డాన్స్ చేసిన గీతూ ఒక్కసారిగా ఎమోషన్ ఐపోయింది. "నన్ను బిగ్ బాస్ హౌస్ విషయాలేవీ అడగొద్దు. నేను తట్టుకోలేను.
ఇన్ని రోజులు ఇంట్లోంచి రాకుండా నా ఎలిమినేషన్ చూసుకుని ఏడుస్తూనే ఉన్నాను. నేను ఇంట్లో ఉన్నన్ని రోజులు నా గురించి ఎవరూ అర్ధం చేసుకోలేదు కానీ బయటికి వచ్చాక అందరూ నన్ను అర్ధం చేసుకున్నారు. నాకు ఇప్పటివరకు 50 వేల మెసేజెస్ వచ్చాయి. అవి ఇంకా చదువుతూనే ఉన్నా. నరసింహ మూవీలో నీలాంబరి ఇంట్లోనే ఎన్నో ఏళ్ళు ఎలా ఉండిపోయిందో నేను కూడా అలాగే ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండి బాధపడ్డా " అని అనేసరికి బిగ్ బాస్ ని హ్యాపీ మెమరీగా మనసులో ఉంచుకో అని గీతూని ఊరుకోబెట్టింది హోస్ట్ శ్రీముఖి.