English | Telugu

ఘనంగా అమరదీప్, తేజస్విని పెళ్లి వేడుకలు..విషెస్ చెప్పిన ఫాన్స్!

స్మాల్ స్క్రీన్ సెలెబ్స్ అంతా ఒక్కొక్కరుగా బ్యాచిలర్ లైఫ్ కి బై బై చెప్పేసి మ్యారేజ్ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. లేటెస్ట్ గా అమర్ దీప్ చౌదరి, తేజస్విని గౌడ ఇద్దరూ కూడా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

బుల్లితెరపై సీరియల్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వీళ్ళు ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటైపోయారు. రెండు రోజుల క్రితమే వీళ్ళ హల్దీ ఫంక్షన్ జరిగింది. అమర్ దీప్ ప్రస్తుతం ‘జానకి కలగనలేదు’ అనే సీరియల్ లో నటిస్తుండగా.. ‘కేరాఫ్ అనసూయ’ సీరియల్ లో హీరోయిన్ గా తేజస్విని నటిస్తోంది. ఇక అమర్ దీప్ లండన్ లో బీటెక్ కంప్లీట్ చేసి ఇండియాకి వచ్చి ‘పరిణయం’ అనే షార్ట్ ఫిల్మ్ తో తన కెరీర్ ని స్టార్ట్ చేసాడు. అలా కొన్ని షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో నటించాడు. `ఉయ్యాల జంపాల` అనే సీరియల్‌ తో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు.

ఆ తర్వాత `సిరిసిరి మువ్వ` సీరియల్ తో లీడ్ యాక్టర్ గా మారాడు. ఇక కర్ణాటకకు చెందిన తేజస్విని బీటెక్ ఎలక్ట్రానిక్స్ లో కంప్లీట్ చేసి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇక ఇప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకుని ఒకింటి వారయ్యారు. నెటిజన్స్, ఫాన్స్ వీళ్లకు "హ్యాపీ మ్యారీడ్ లైఫ్" అని విషెస్ చెప్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.