English | Telugu

సుధీర్ ఇంట్లో విషాదం.. చివరిచూపు కూడా దక్కలేదు!

సుడిగాలి సుధీర్ గురించి తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. ఎంతో కష్టపడి టీవీ కమెడియన్ గా, హోస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. 'జబర్దస్త్' లోకి రావడానికి ముందు సుధీర్ మెజీషియన్ గా పని చేశాడు. ఎన్నో ఈవెంట్స్ లో మ్యాజిక్ చేసిన సుధీర్ ఫైనల్ గా 'జబర్దస్త్' షోలో చేరి బాగా పాపులారిటీ సంపాదించాడు. ప్రస్తుతం 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోతో బిజీగా ఉన్నాడు సుధీర్. మల్లెమాల ప్రొడక్షన్ లో ఈటీవీలో ప్రసారం అవుతున్న ఈ షోలో రామ్ ప్రసాద్, హైపర్ ఆది వంటి కమెడియన్స్ కూడా స్కిట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం టాప్ కామెడీ షోలలో ఒకటిగా 'శ్రీదేవి డ్రామా కంపెనీ' దూసుకుపోతుంది. అయితే తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో సుధీర్ కంటతడి పెట్టుకున్నాడు. కార‌ణం.. ఇటీవల సుధీర్ ఇంట్లో ఓ విషాదం చోటుచేసుకుంది. అతడి అమ్మమ్మ కరోనా సోకి కన్నుమూశారు. అయితే చివరిసారి ఆమెను చూడడానికి కూడా పరిస్థితులు అనుకూలించలేదని ప్రోమోలో సుధీర్ క్లోజ్ ఫ్రెండ్‌ రామ్ ప్రసాద్ ఆ విషయాన్ని చెప్పుకొచ్చాడు.

అమ్మమ్మ చనిపోయిందని తెలిసి సుధీర్ చాలా బాధపడ్డాడని చెబుతూ.. వెళ్లాలని ఉన్నా వెళ్లలేకపోయినట్లు రామ్ ప్రసాద్ వివరణ ఇచ్చాడు. ఈ క్రమంలో సుధీర్ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆదివారం మధ్యాహ్నం ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ షోకి నటుడు పృథ్వీతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కూడా వచ్చారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.