English | Telugu
శ్రీలేఖ పాట విని బాలుగారు అంతమాటన్నారా?
Updated : Jul 22, 2022
డైలాగ్ కింగ్ సాయి కుమార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో `వావ్`. ప్రస్తుతం సీజన్ 3 ప్రసారం అవుతోంది. `మాంచి కిక్ ఇచ్చే గేమ్ షో` అనే క్యాప్షన్ తో ఈ షోని రన్ చేస్తున్నారు. ప్రతీ మంగళవారం ఈటీవీలో ప్రసారం అవుతూ విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజా ఎపిసోడ్ కోసం ఈ షోలో ఎమ్.ఎమ్. శ్రీలేఖ, సాందీప్, అదితి భావరాజు, కారుణ్య పాల్గొని సందడి చేశారు. ఈ నెల 26న మంగళవారం ప్రసారం కానున్న తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.
ప్రస్తుతం నెట్టింట ఈ ప్రోమో సందడి చేస్తోంది. ఎమ్.ఎమ్. శ్రీలేఖ సంగీత దర్శకురాలు కావడానికి స్ఫూర్తి ఎవరో, ఏ కారణం వల్ల తాను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యిందో వెల్లడించింది. అంతే కాకుండా బాలు గారు తన పాట విని ఏమన్నారో కూడా వివరించింది. ముందు కామెంట్ చేసిన ఆయనే ఆ తరువాత కాకి కోకల అయ్యిందని కాంప్లిమెంట్ ఇచ్చారట. అన్నయ్య కీరవాణి కారణంగానే తాను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యానని, అయితే అందుకు అన్నయ్య కారే కారణమని చెప్పింది. తనకూ కారు వుండాలనే పట్టుదలే తనని మ్యూజిక్ డైరెక్టర్ని చేసిందని చెప్పుకొచ్చింది.
ఇక ఒక పాట పాడటానికి వెళ్లి నాలుగు పాటలు పాడానని, లెక్కలేనన్ని పాటలు పాడాలన్నదే తన కల అని కారుణ్య తెలిపాడు. యుఎస్ లో పుట్టి పెరిగిన అదితి భావరాజు గాయనిగా తన సంగీత ప్రయాణం ఎలా మొదలైందో చెప్పుకొచ్చింది. మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియాలంటే వచ్చే మంగళవారం రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానున్న `వావ్ 3` మాంచి కిక్ ఇచ్చే గేమ్ షో చూడాల్సిందే.