English | Telugu
`రాధమ్మ కూతురు` కోసం బుల్లితెరకు యంగ్ హీరో!
Updated : Jul 23, 2022
టాలీవుడ్ హీరో నిఖిల్ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. `రాధమ్మ కూతురు` సీరియల్ లో సడన్ ఎంట్రీ ఇచ్చి ఫైట్ లు చేశాడు. వివరాల్లోకి వెళితే.. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ నటిస్తున్న సూపర్ నేచురల్ స్పిర్చువల్ థ్రిల్లర్ `కార్తికేయ 2`. చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. 2014లో వచ్చన `కార్తికేయ` మూవీకి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. శ్రీకృష్ణుడికి సంబంధించిన చరిత్ర, ద్వారకా నగరంపై అన్వేషణ చేసే ఓ మెడికోగా నిఖిల్ కనిపించనున్నాడు.
ఈ మూవీ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్న ఇస్కాన్ ఇంటర్నేషనల్ వారు మధురలో వున్న బృందావానానికి చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. దీంతో ఈ మూవీ మరింతగా వార్తల్లో నిలిచింది. జూలై 22న విడుదలకు ప్లాన్ చేసిన ఈ మూవీని `థాంక్యూ` కారణంగా వాయిదా వేశారు. ఆగస్టు 12న పాన్ ఇండియా వైడ్ గా ఐదు భాషలలో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో నిఖిల్ బుల్లితెరపై అడుగు పెట్టాడు. జీ తెలుగులో ప్రసారం అవుతున్న `రాధమ్మ కూతురు` సీరియల్ లో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చాడు.
రాదమ్మ పెద్ద కూతురు అక్షరని ఓ కారులో బంధించి ఆమె భర్త అరవింద్ కు మరో పెళ్లి చేస్తుంటారు. దీని వెనక పెద్ద కుట్రే జరుగుతుంటుంది. ఆ కుట్రని చేధించే క్రమంలో రాధమ్మ చిన్నకూతురు సాక్ష్యంతో పెళ్లిని అడ్డుకోవడానికి వస్తుంటుంది. తను పెళ్లికి రాకుండా రౌడీలని ఏర్పాటు చేస్తారు పెళ్లి కూతురు తండ్రి. వారి నుంచి రాధమ్మ చిన్న కూతురుని రక్షించి ఆమెని పెళ్లి మండపానికి తీసుకెళ్లే సన్నివేశంలో నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. ఓఫైట్ సీన్ ని కూడా నిఖిల్ పై షూట్ చేశారు. `కార్తికేయ 2` ప్రచారం కోసం నిఖిల్ మొత్తానికి బుల్లితెర ఎంట్రీ ఇచ్చాడన్నమాట.