English | Telugu
కార్తీకదీపం: రత్నసీత రీఎంట్రీ.. మోనితకు షాక్
Updated : Dec 24, 2021
బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తున్న పాపులర్ సీరియల్ `కార్తీక దీపం`. కాపుగంటి రాజేంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సీరియల్ గత కొం కాలంగా టాప్ రేటింగ్ తో రికార్డులు సృష్టిస్తోంది. ప్రతీ వారం చిత్ర విచిత్రమైన మలుపులతో సాగుతున్న ఈ సిరియల్ ఈ శుక్రవారం సరికొత్త ట్విస్ట్ ఇవ్వబోతోంది. ఈ శుక్రవారం ఈ సీరియల్ 1231వ ఎపిసోడ్ లోకి ఎంటరవుతోంది. ఈ సందర్భంగా పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అవేంటి? .. ఇంతకీ ఈ రోజు సీరియల్ ఏ మలుపు తీసుకోబోతోందన్నది ఒకసారి చూద్దాం.
తన కొడుకుని కావాలనే సౌందర్య కుటుంబం తప్పించి దాచేసిందని రగిలిపోతున్న మోనిత ఆ పగతో శ్రావ్య కొడుకుని దాచేసి కొంత సేపు భయపెడుతుంది. ఆ తరువాత శ్రావ్య ఏడుపు చూడలేక బిడ్డ కనిపించకపోతే తల్లి ఎంతగా తల్లడిల్లుతుందో ఇప్పటికైనా అర్థమైందా? అంటూ `ఎలా వుంది ఆంటీ నేనిచ్చిన ఝలక్` అని సౌందర్యని ఆటపట్టిస్తుంది. కట్ చేస్తే `హిమ, రౌడీ బ్యాగ్స్ తగిలించుకని స్కూల్ కి వెళుతూ దీపకు బాయ్ చెబుతుంటారు. వారిని చూసి ఎలా పెరగాల్సిన పిల్లలు ఎలా అయిపోయారని కార్తీక్ మదన పడుతుంటాడు.
Also read:అమ్మ బాలయ్యా.. నాగ్ సీట్ కే ఎర్త్ పెట్టావే!
కట్ చేస్తే ... సౌందర్య .. మోనితకు సహాయం చేసిన రత్నసీతని కలుస్తుంది. `నువ్వు మోనితకి ఏ స్థితిలో సాయం చేశావో .. ఎందుకు చేశావో అవన్నీ నేను అడగను. నువ్వు చేసిన సాయానికి మేము చాలా నష్టపోయాం. అయినా నీ సాయం కోరి వచ్చాను. ఆ మోనిత బాబుని అడ్డం పెట్టుకుని మాతో ఆడుకుంటోంది. ఆ బాబుని నీదగ్గర దాచిందేమోననే అనుమానంతో వచ్చాను. నిజం చెప్పు ప్లీజ్ అంటుంది సౌందర్య. మేడం నాకు తెలియదు. మోనితకు సాయం చేసినందుకు ఇప్పటికీ ఫీలవుతున్నా. మీకు హెల్ప్ చేయమన్నా చేస్తా.. అప్పుడైనా నా గిల్టీ ఫీలింగ్ కొంచమైనా పోతుంది. అని చెబుతుంది రత్న సీత.
Also read:షన్నుకి దీప్తి షాక్.. వైరల్ అవుతున్న పోస్ట్
అయితే మోనిత కదలికలపై ఓ కన్నేసి వుంచమని, తన కదలికలని గమనించమని, తను ఎవరిని ఎక్కడ ఎప్పుడు కలుస్తుందో... ఎలాంటి ప్లాన్ లు వేస్తుందో కనిపెట్టమని రత్న సీతకు చెబుతుంది సౌందర్య. ఇక నుంచి అదే పనిలో వుంటానని, మీకు నా వంతు సహాయం చేస్తానని రంగంలోకి దిగుతుంది రత్నసీత. ఆ తరువాత ఏం జరిగిందన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.