English | Telugu

ఆ హగ్గులు చూసి మీ ఇంట్లో వాళ్ళు ఏం అనరా సోనియా!

నిన్న బిగ్ బాస్ హౌస్ నుండి సోనియా ఎలిమినేట్ అయి బయటకొచ్చింది. ఇక బజ్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు షాకింగ్ రిప్లై ఇచ్చింది సోనియా.. అవేంటో చూసేద్దాం.

హౌస్‌లో బెస్ట్ బాండింగ్ ఎవరితో ఉందని యాంకర్ అడుగగా.. అభయ్, నిఖిల్, పృథ్వీ అని సోనియా చెప్పింది. నిఖిల్‌ పై మీ మీకు ఏ ఫీలింగ్ ఉందని సూటిగా అడుగగా.. మా అన్నలాగ.. ఇంట్లో వాళ్లలాగ అని సోనియా అంది. ఆ సమాధానం విన్న అర్జున్‌కి దిమ్మతిరిగిపోయింది. ఏంటీ అన్నా? అని తలపట్టుకున్నాడు యాంకర్. బిగ్ బాస్ హౌస్‌లో వాళ్లని మ్యానిప్యులేట్ చేసినట్టు నన్ను కూడా మ్యానిప్యులేట్ చేయకు అక్కా అని యాంకర్ అన్నాడు. నువ్వు ఫీల్ అవ్వనంటే ఓ ప్రశ్న అడుగుతా.. పృథ్వీ ఆవేశమే అతని మైనస్ అని నీకు తెలిసినా.. వాడ్ని ఒక వెపన్‌లా వాడింది నిజం కాదా? ముందుండి నడిపిస్తున్నా అని మీరు అనుకున్నా.. వెనుకుండి నడిపిస్తున్నారనేది మా ఆడియన్స్‌కి తెలుసని యాంకర్ అనగా.. పృథ్వీకి ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పా అని సోనియా అంది. చేయాల్సిందంతా చేసేసి.. ఏమి తెలియనట్టు కూర్చుంటారు.. కపటనాటక సూత్రధారి అని యాంకర్ అన్నాడు. సరే.. హౌస్‌లో వీక్ పర్సన్ ఎవరని అనుకుంటున్నారని అడుగగా.. నైనిక అని సోనియా చెప్పింది. ఆడియన్స్ ఏమనుకుంటున్నారో తెలుసు.. వీక్ పర్సన్ నిఖిల్ అని అనుకుంటున్నారంటు యాంకర్ అన్నాడు. హౌస్‌లో ఆడపులి అని నీకు నువ్వే బిరుదు ఇచ్చేసుకున్నావా అని యాంకర్ అడుగగా.. నన్ను ఇంట్లో కూడా అలాగే అంటారని సోనియా అంది. ఆడపులి అంటే ముందుకొచ్చి ఆడుతుంది.. పిల్లిలాగ వెనుక నుంచి కాదని యాంకర్ అన్నాడు. నీ వల్ల నిఖిల్, పృథ్వీలు.. బాధితులుగా మారారని యాంకర్ అనగా.. నా బాధితులు అయితే వాళ్లు కదా బయటకు రావాలి.. నీనెందుకు వచ్చానని సోనియా చెప్పది. వాళ్లు బాధితులు.. మీరు బాధపెట్టిన వాళ్లు కాబట్టి బయటకు వచ్చారని యాంకర్ అన్నాడు. సరే చూద్దాం.. వాళ్లు ఎన్ని రోజులు ఉంటారా అని సోనియా అంది.

ఒక్క మాట అంటే సోనియాని అడల్ట్ రేటెడ్ అని.. ఇంట్లో వాళ్లు చూస్తారని అన్నారు.. ఈ హగ్‌లను ఇంట్లో వాళ్లు చూడరా అని అడుగగా.. అవి హగ్‌లు కాదు.. స్పెషల్ మూమెంట్స్ అని సోనియా అంది. నిఖిల్‌కి ఒక మాట ఇచ్చావ్ కదా.. నువ్వు స్మోకింగ్ మానేస్తే అడిగింది ఇస్తారా అని.. ఏం ఇద్దాం అనుకున్నావని అడుగగా.. సోనియా మౌనంగా ఉంది. ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నారా? లేదంటే బ్లాంక్ అయిపోయారా? అంటూ అర్జున్ అనగానే.. సోనియా నోటి వెంట మాట రాలేదు. ఇక ఈ ప్రోమో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. మీరు ఓ లుక్కేయండి.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.