English | Telugu

ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో ఎలిమినేషన్ ఎవరో తెలుసా?

బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. మిగిలిన వారిలో మొత్తం ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది.

అయితే నిన్న హౌస్ లో పృథ్వీ-విష్ణుప్రియ మధ్య జరిగింది చూస్తుంటే ఈ వారం ఓటింగ్ పరంగా లీస్ట్ లో ఉన్న పృథ్వీని ఎలిమినేషన్ చేయకుండా ఆపి.. విష్ణుప్రియతో లవ్ ట్రాక్ చేసేలా ఉన్నాడు బిగ్ బాస్ మావ. నిన్న హౌస్ లో .. విష్ణుప్రియ దగ్గరుండి పృథ్వీకి మేకప్ వేసి డ్రెస్ వేసి రెడీ చేసింది. రెడీ అయ్యాక పృథ్వీని చూసి తెగ మురిసిపోయింది విష్ణుప్రియ. దీంతో మనోడు ఓ టైట్ హగ్ ఇచ్చాడు. ఇక ఈ యవ్వారాలన్నీ చూసి సోనియా తెగ కుళ్లుకుంది. నాకు పృథ్వీని చూస్తుంటే భయమేస్తుంది.. పడిపోతున్నాడు వాడు విష్ణుకి.. అంటూ సోనియా అంది. అవును నేను అబ్జర్వ్ చేస్తున్నా విష్ణుపై సాప్ట్ కార్నర్ ఉంది వాడికి అంటూ నిఖిల్ అన్నాడు. నాకు ఏది నిజమో ఏది అబద్ధమో తెలీదు కానీ.. విష్ణుప్రియ మీద సాఫ్ట్ ఒపినీయన్ అయితే కనిపిస్తుంది.. వాడు ఏం చేస్తలేదు కానీ పడిపోతున్నాడు.. వాడికి ఎఫెక్ట్ అవ్వకపోయేవరకూ ఏదైనా పర్లేదులే అంటూ సోనియా అంది.

హౌస్ లో సోనియా చెప్పినట్టుగా నిఖిల్, పృథ్వీ వింటున్నారనేది అందరికి తెలిసిన నిజమే. అయితే ఈ సారి ఓటింగ్ లో లీస్ట్ లో ఉంది పృథ్వీ అండ్ సోనియా.. కానీ సోనియాని ఎలిమినేషన్ చేస్తే కంటెంట్ ఉండదు, పృథ్వీని ఎలిమినేషన్ చేస్తే లవ్ ట్రాక్ ఉండదు. దీంతో వీరిద్దరి కంటే పైనున్న ఆదిత్య ఓం ని ఎలిమినేషన్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ ఎవరితో కంటెంట్ వస్తుందో వారిని ఎలిమినేషన్ చేయకుండా ఆపేస్తాడని అందరు అనుకుంటున్నారు. అయితే సోనియాని ఎలిమినేషన్ చేయాలని బిబి ఆడియన్స్ తెగ కామెంట్లు చేస్తున్నారు. సోనియా ఎలిమినేషన్ బటన్, సోనియా ఎలిమినేషన్ కన్ఫమ్, ప్లీజ్ ఎలిమినేట్ సోనియా అంటు ట్యాగ్ లు పెడుతూ తనని ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారో చూడాలి మరి.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.