English | Telugu

ట్రెండింగ్ లో శివాజీ.. సీజన్-7 టైటిల్ SPY లో ఒక్కరికేనా!

బిగ్ బాస్ సీజన్-7 లో సీరియల్ బ్యాచ్ ఎంత ఫేమసో.. శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ అంతే ఫేమస్. సీరియల్ బ్యాచ్ వాళ్ళేమో రివేంజ్, స్ట్రాటజీ, గ్రూపిజం అంటు మాట్లాడుకుంటూ కలిసి హౌస్ లో ఉంటే.. శివాజీ, ప్రశాంత్, యావర్ వీళ్ళేమో ఫెయిర్ గా ఆడాలి‌. మనం మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలి. ధర్మంగా ఆడాలని వీళ్ళుంటారు.

బిగ్ బాస్ సీజన్-7 తుది దశకు చేరుకుంది. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కావడంతో శనివారం నాటి ఎపిసోడ్‌లో అశ్వినిశ్రీని ఎలిమినేట్ చేసాడు నాగార్జున. మరి తర్వాతి ఎలిమినేషన్ ఎవరంటు ఇప్పటికే నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటి మద్యలో అమర్ దీప్ గతవారం, ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ రేస్ లో ఫైనల్ దాకా వచ్చి ఓడిపోయాడు. అయితే శుక్రవారం నాటి కెప్టెన్సీ టాస్క్ లో.. అర్జున్ కోసం శివాజీ, అమర్ కోసం శోభాశెట్టి స్టాండ్ తీసుకున్నారు. బిగ్ బాస్ ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోమని చెప్పగా ఇద్దరి మద్య చాలా‌సేపు డిస్కషన్ జరిగింది. దీంతో ఇచ్చిన సమయంలో నిర్ణయం తీసుకోలేదని కెప్టెన్సీ టాస్క్ ని రద్దు చేశాడు బిగ్ బాస్.

అయితే అమర్ దీప్ ఏడ్వడంతో తన ఫ్యాన్స్ శివాజీ వర్సెస్ అమర్ దీప్ లలో ఎవరు కరెక్ట్ అంటూ ట్విట్టర్ లో వీడియోలు పెడుతున్నారు. ఇక దీనిని చూసిన SPY(శివాజీ, ప్రశాంత్,యావర్) ఫ్యాన్స్.. అమర్ దీప్ హౌస్ లోకి వచ్చిన దగ్గర నుండి చేసిన ఫౌల్ గేమ్, వాళ్ళ గ్రూపిజం అన్నీ బయటకు తీస్తూ.. #శివాజీ ది విన్నర్ అంటూ ట్రెండింగ్ క్రియేట్ చేశారు. ఇది కాస్త వైరల్ గా మారింది. శివాజీ, యావర్, ప్రశాంత్ ముగ్గురు కలిసి ఉండే కొన్ని వీడియో క్లిప్స్ ని ఎడిట్ చేస్తున్నారు. SPY ఫ్యాన్స్ శివాజీ, ప్రశాంత్, యావర్ ల బాండింగ్ గురించి అప్లోడ్ చేసిన వీడియోలని చూస్తే ఎవరికైన గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఎమోషనల్ గాను, ఇన్ స్పైరింగ్ గాను చూపిస్తూ వాటికి తగ్గట్టు మ్యూజిక్ ని యాడ్ చేస్తున్నారు. కాగా ఇవి ఫుల్ వైరల్ గా మారాయి.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..

Brahamamudi: మోడల్ ఫోటోషూట్ కోసం కావ్య ఒప్పుకుంటుందా.. రాజ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -908 లో.... రాజ్ గుర్రంపై కూర్చొని ఊరేగుతున్నట్లు తన ఫోటోని రాజ్ కి చూపిస్తుంది కావ్య. అది చూసి నన్ను అలా చేస్తావా అని కావ్య ఫోటోని మోడల్ గా పెట్టి చూపిస్తాడు. చీ బాలేదు తీసెయ్యండి అని కావ్య అంటుంది. కావ్య ఎప్పుడు సంప్రదాయంగా ఉంటుందని ఫోటో మర్చి చూపిస్తుంది. అది చూసి రాజ్ ఫ్లాట్ అవుతాడు. ఇంట్లోనే మోడల్ ని పెట్టుకొని బయట వెతుకుతున్నానని రాజ్ అనుకుంటాడు. ఎలాగైనా యాడ్ లో చెయ్యడానికి కావ్యని ఒప్పించాలని అనుకుంటాడు.

Karthika Deepam2: వైరా ఇచ్చిన డీల్ కి ఒకే చెప్పిన కాశీ.. పోలీస్ స్టేషన్ కి శ్రీధర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -545 లో....వైరా దగ్గరికి కాశీ వస్తాడు. కాశీ రాగానే రండి సర్ అని కాశీకీ వైరా మర్యాద ఇస్తుంటే నాకు మర్యాద ఇస్తున్నారేంటని కాశీ అడుగుతాడు. మీ రెజ్యుమె చూసాను.‌ చాలా బాగుంది. మనకంటే టాలెంట్ ఎక్కువ ఉన్నవాళ్లు మనకన్నా చిన్న ఏజ్ అయిన రెస్పెక్ట్ ఇవ్వాలని వైరా అంటాడు.. నాకు జ్యోత్స్న ఫోన్ చేసి చెప్పింది మీరు ప్రెజెంట్ ఏం చేస్తున్నారని వైరా అడుగగా జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓ దగ్గర పిఏగా చేస్తున్నానని కాశీ చెప్తాడు. ఏంటి అంత చిన్న జాబ్ చేస్తున్నారా అని వైరా అంటాడు.