English | Telugu

Karthika Deepam 2 : తన బావనే పెళ్ళి చేసుకుంటానన్న జ్యోత్స్న.. పారిజాతం పాచిక పనిచేసిందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఇది నవ వసంతం. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -6 లో.. దీపని అవమానించిన వాళ్లకి అప్పు ఇచ్చిన వ్యక్తి మళ్ళీ తిరిగి దీప దగ్గరికి వస్తాడు. ప్రొద్దున నీకు భర్త గా ఉంటానంటే నన్ను కొట్టావ్.. ఎవరితోనో కొట్టించావ్.. ఇప్పుడు నా సంగతేంటో చూపిస్తానంటు అతను అంటాడు. అప్పుడే దీప వెనకాలే ఉన్న.. తన భార్యని చూసి అతను షాక్ అవుతాడు. ఒక ఆడదానితో ఇలాగేనా మాట్లాడేదంటూ తను తన భర్తని తిడుతుంది. నీ సంగతి చెప్తాను అంటు తీసుకొని వెళ్తుంది.

మరొకవైపు శివన్నారాయణ దగ్గరికి పారిజాతం వచ్చి.. డబ్బులు ఇవ్వమని అడుగుతుంది. నీకు ఆ బంటి గానికి అతని భార్యకు కలిసి నెలకు మూడు లక్షలు ఖర్చు అవుతుంది. తిరిగి నువ్వే ఇవ్వాలి అని శివన్నారాయణ అనగానే.. పారిజాతం డిజప్పాయింట్ అవుతుంది. అప్పుడే డబ్బులు కావాలని పారిజాతం దగ్గరికి బంటి రాగానే.. తన చెంపపై ఒక్కటిస్తుంది. డబ్బులు అడిగితే మీ అయ్యగారు తిట్టి పంపించాడని బంటికి చెప్తుంది. ఆ తర్వాత రాత్రి మిస్ హైదరాబాద్ గా జ్యోత్స్న అయినందుకు పార్టీ ఇస్తారు. అప్పుడే జ్యోత్స్న కాలేజీ ఫ్రెండ్ కారులో వచ్చి రింగ్ గిఫ్ట్ గా ఇస్తాడు. కానీ జ్యోత్స్న మాత్రం తన బావ కార్తీక్ వచ్చాడని ఉహించుకొని బావ అంటుంది. బావ కాదు నీ కాలేజీ ఫ్రెండ్ రింగ్ తో ప్రపోజ్ చెయ్యడానికి వచ్చానని చెప్పగానే జ్యోత్స్న ఒప్పుకోదు. రింగ్ కూడా రిటర్న్ ఇస్తుంది. నా బావ కార్తీక్ ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని జ్యోత్స్న చెప్తుంది.. రింగ్ తీసుకొని ఉంటే బాగుండేదంటు పారిజాతం అనగానే.. అందరు తనని తిడుతారు.

ప్రొద్దున అయ్యగారు, ఇప్పుడు సుమిత్ర మిమ్మల్ని అవమానించారు మీకు విలువ పెరిగేలా చేస్తానని పారిజాతంతో బంటి అంటాడు. ఆ తర్వాత సుమిత్ర కోపంగా.. బంటీ అంటూ పిలుస్తుంది. కాసేపటికి బంటి వచ్చాక.. వీడు నా పేరు మీద మూడు లక్షలు తీసుకొని ఈ విషయం ఎవరికి చెప్పొద్దని లంచం కూడ ఇచ్చాడట అని అతనిని సుమిత్ర తిడుతుంది. ఇక అది డైవర్ట్ చేయడానికి బంటిని పారిజాతం తిట్టినట్లు చేసి ఇంట్లో నుండి పంపించకుండా, వెళ్లి పనిచేసుకో అంటూ పంపిస్తుంది. మరొకవైపు దీప తన తండ్రి కుబేరుని ఫోటో చూస్తూ బాధపడుతుంటుంది. అప్పుడే అప్పు ఇచ్చి దీపతో దెబ్బలు తిన్న అతను.. కొంతమందిని తీసుకొని దీప దగ్గరికి వస్తాటు. అప్పు చెల్లించాలని అడిగినందుకు ఇలా కొట్టారంటూ అతను చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.