English | Telugu

క్యాష్‌: స్టేజ్ పైనే క‌మెడియ‌న్ చేత తాళి కట్టించిన సుమ‌!

యాంక‌ర్ సుమ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న కామెడీ షో `క్యాష్ దొరికి నంత దోచుకో`. వివిధ టీవీ షోలు, సీరియ‌ల్ స్టార్స్ తో పాటు సినిమా స్టార్స్ ని ఈ షోకు ఆహ్వానిస్తూ సుమ చేసే అల్ల‌రి అంతా ఇంతా కాదు. ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న ఈ షో గ‌త కొంత కాలంగా మంచి రేటింగ్ తో ఆద్యంతం సుమ పంచ్ ల‌తో అల‌రిస్తూ సాగుతోంది. స్టార్స్ ని ఆహ్వానిస్తూ వారిపై సెటైర్లు వేస్తూ నవ్వులు పూయిస్తున్న ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని తాజాగా విడుద‌ల చేశారు. ఈ షోలోకి ఈ వారం జ‌బ‌ర్ద‌స్త్ టీమ్ మెంబ‌ర్స్ కెవ్వు కార్తీక్ - భాను, నూక‌రాజు - అసియా, ప‌ర‌దేశి - ష‌బీనా, ప్ర‌వీణ్ -ఫైమా జోడీగా ఈ షొలో పాల్గొన్నారు.

`ప‌టాస్‌` టైమ్ లో నూక‌రాజు - అసియా ప్రేమ‌లో ప‌డ్డారు. అప్ప‌టి నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య ల‌వ్ ట్రాక్ సీరియ‌స్ గా సాగుతోంది. ఇది `క్యాష్ ` షోలోనూ క‌నిపించింది. షోలోకి ఎంట్రీ ఇస్తూనే నూక‌రాజు - అసియా జోడీ షాకిచ్చారు. అసియాని చేతుల్లో ఎత్తుకున్న నూక‌రాజు గిరి గిరా న‌డుముచుట్టూ తిప్పేస్తూ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఏం జ‌రుగుతోందో అర్థం కాక సుమ షాక్ తో చూస్తూ వుండిపోయింది. ఆ త‌రువాత ఏంటీ ఆ అమ్మాయిని మేక‌పిల్ల‌ని తిప్పిన‌ట్టు అలా తిప్పావ్ అంది సుమ‌.

వెంట‌నే `నా పెళ్ల‌మే క‌దా` అనేశాడు నూక‌రాజు. క‌ట్ చేస్తే .. పీది పిజ‌మైన ప్రేమ అయితే వెలిగించుకో అంటూ హార‌తి క‌ర్పూరం, అగ్గిపెట్టె నూక‌రాజు చేతితో పెట్టింది సుమ‌. వెంట‌నే నూక‌రాజు హార‌తి క‌ర్పూరాన్ని వెలిగించుకున్నాడు. వ‌ద్దంటూ అసియా ఎమోష‌న‌ల్ అయింది. ఆ త‌రువాత నూక‌రాజు చేత అసియా మెడ‌లో తాళిక‌ట్టించింది సుమ‌. మా అంద‌రికి సాక్షిగా అసియా మెడ‌లో తాళిక‌ట్టు అని అత‌ని చేతికి తాళి ఇవ్వ‌డంతో అసియా మెడ‌లో క‌ట్ట‌డానికి వెళ్లాడు.. ఆ త‌రువాత ఏం జ‌రిగింది? అన్న‌ది తెలియాలంటే ఆగస్టు 6 శ‌నివారం రాత్రి 9:30 గంట‌ల‌కు ప్ర‌సారం కానున్న `క్యాష్‌` షో చూడాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.