English | Telugu
శ్రీముఖి ఏమిటి ఇలా మారిపోయింది?
Updated : Aug 9, 2022
శ్రీముఖి ఎప్పుడు ఎక్కడ ఉంటె అక్కడ అల్లరే అల్లరి. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త కొత్త యాప్స్ , ఫిల్టర్లు ఇంట్రడ్యూస్ అవుతుండేసరికి కామన్ మాన్ నుంచి టాప్ మోస్ట్ సెలెబ్స్ వరకు ఆ ఫిల్టర్స్ ని యూస్ చేస్తూ రకరకాలుగా అల్లరి చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు . ఇప్పుడు అలాంటి అల్లరి ఫిల్టర్స్ తో శ్రీముఖి, శృతి హాసన్ సందడి చేశారు. ఈ ఫిల్టర్స్ ఎలా ఉంటాయి అంటే రకరకాల యానిమేషన్స్తో మన హావభావాల్ని ముఖ కవళికల్ని మార్చేస్తూ ఉంటాయి. పళ్ళు ఎత్తుగా ఉండేలా, తలకు రిబ్బన్లు కట్టుకున్నట్టుగా, చిన్నపిల్లలా మాటల్లా, కళ్ళజోళ్ళతో, పెద్ద పెద్ద కళ్ళు, వాచిన పెదాలు, గుండుతో , గడ్డంతో ఇలా రకరకాల ఫిల్టర్స్ ఆండ్రోయిడ్స్ లో వచ్చేసరికి అందరూ వాటిని ట్రై చేస్తూ స్టేటస్ లో పెట్టుకుని మురిసిపోతున్నారు.
శ్రీముఖి, శృతిహాసన్ కూడా అలాంటి ఒక అల్లరి ఫిల్టర్ ని తీసుకుని వాళ్ళ ఫేసెస్ ని మార్చేసుకుని చిన్నపిల్లల్లా ఒక ఈవెంట్ లో సందడి చేయడం నవ్వు తెప్పిస్తోంది. ఇక ఆ ఫన్నీ వీడియోని శ్రీముఖి తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది. " చూడండి ఇక్కడ ఎవరు ఉన్నారో, శృతిహాసన్..తన సెల్ లో ఉన్న ఫిల్టర్స్ తో ఇలా మార్చేశారు. మనకు కూడా ఇవంటే ఇష్టం కదా" అనే టాగ్ లైన్ పెట్టేసింది. ఇంకా ఈ ఫిల్టర్ అల్లరి వీడియోని చూసి నెటిజన్స్ కూడా ఇల్లాంటివి యూజ్ చేసి పాపులర్ అవడం ఫన్ చేయడం నీ తర్వాతే ఎవరన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.