English | Telugu

శ్రద్ధాదాస్ కి ఢీ 14 షోలో ఘోర అవమానం

ఢీ 14 డ్యాన్సింగ్ సీజన్ లేటెస్ట్ ప్రోమో ఇప్పుడు రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో హీరోయిన్ శ్రద్దాదాస్ డాన్స్ ఇరగదీసేసింది. ఈ వారం కొరియోగ్రాఫర్స్ స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఫైనల్ లో శ్రద్ధాదాస్ ఒక టీం కొరియోగ్రాఫర్ తో కలిసి డాన్స్ చేసేసరికి ఆపోజిట్ టీం నుంచి కిరణ్ అనే పర్సన్ లేచి స్టేజి మీదకు వచ్చి పెద్ద న్యూసెన్స్ చేస్తాడు. వాళ్ళ టీమ్ తో కలిసి మీరు డాన్స్ చేశారు...మా టీమ్ తో ఎందుకు చేయలేదు అని అడుగుతాడు. ఇదంతా గమనిస్తున్న ప్రదీప్ సర్దిచెప్పబోతాడు.. నువ్వు వాయిస్ రైజ్ చేసి మాట్లాడకు అంటూ ప్రదీప్ మీద, శ్రద్ద మీద ఫుల్ సీరియస్ ఐపోతాడు. అప్పటివరకు కూల్ గా ఉన్న స్టేజి కాస్తా చాలా హీట్ గా మారిపోయింది. వాళ్ళతో డాన్స్ చేసి ఆ టీమ్ వాళ్ళకే మంచి మార్క్స్ ఇస్తారు ..నాకు తెలియనిదా అంటూ ఫైర్ అవుతాడు కిరణ్.

శ్రద్ద ఘాటుగా సమాధానం ఇచ్చేసరికి తనకు కూడా గొంతు పెంచి మాట్లాడొద్దు, నేనేం చేయాలో మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ అవమానిస్తాడు. ఆ మాటకు వెంటనే శ్రద్ద మైక్ ఇచ్చేసి ఏడ్చుకుంటూ అక్కడినుంచి స్టేజి దిగి వెళ్ళిపోతుంది. ఫైనల్ గా ఆది ఎంట్రీ ఇచ్చి ఏదో చెప్దామని ట్రై చేసేసరికి అన్నా నువ్వు మధ్యలో రాకు అంటూ ఆది మీద కూడా అదే సీరియస్ మైంటైన్ చేస్తాడు. ఇదంతా ఎందుకు అంటూ అతన్ని సెట్ నుంచి పంపించేస్తున్నట్టుగా ఉన్న ఒక ప్రోమో కట్ చేశారు. ఇంకా ప్రదీప్ తో, శ్రద్దాతో గొడవ పడిన కిరణ్ ఎవరో కాదు. సోషల్ మీడియాలో ప్రాంకుల కిరణ్ గా ఫుల్ ఫేమస్ ఐన వ్యక్తి. అతను ఎంతోమందితో ప్రాంక్ లు చేసి ప్రాంక్ స్టార్ మచ్చాగా పేరు తెచ్చుకున్నాడు కిరణ్. ఐతే నెటిజన్స్ మాత్రం ఇదంతా ప్రాంక్ మమ్మల్ని మోసం చేయలేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.