English | Telugu

'నా మీదే ఫన్ చేస్తావా?'.. రష్మి మీద మండిపడిన ప్రగతి!

'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఎవ్రీ ఎపిసోడ్ అద్భుతంగా హాస్యాన్ని పండిస్తోంది. ఇక ఈ వారం ఎపిసోడ్ చాలా చక్కగా సందడి చేసింది. ప్రగతి, సంఘవి స్పెషల్ గెస్ట్స్ గా వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ అందించారు. ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ కేలండర్ 2022ని ప్రగతి, సంఘవి చేతుల మీదుగా ఓపెన్ చేయించింది ర‌ష్మీ. "ప్రగతి గారూ.. నాకు మీ దగ్గర నుంచి కొన్ని టిప్స్ కావాలి. మీ ఎన‌ర్జీకి అసలు రహస్యం ఏమిటి? మీరు చాలా ఎక్సర్‌సైజులు చేస్తూ ఉంటారు కదా. మీ ఎనర్జీ రహస్యం నాకు చెప్తే.. ఈవెన్ ఐ వాంట్ టు బి ఇన్ జర్నీ ఆఫ్ మై ఫిట్నెస్. ఎప్పుడు మీరు చక్కగా జిమ్ లో ఉంటారు?" అంటూ చాలా ఉత్సాహంగా అడిగింది రష్మీ.

వెంటనే ప్రగతి ఆ మాటకు సీరియస్ అయిపోయింది. "వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా.. అంతా నా ఎక్సర్‌సైజ్ గురించే. నీ ఇన్ఫర్మేషన్ కి థాంక్స్. నన్ను ఇక్కడికి నా యాక్షన్ చూసి పిలిచారు. నా వర్కౌట్స్ చూసి కాదు. కాసేపు ఇక్కడ ఉండడానికి వచ్చాను. నా మీద ఇలా హాస్యం చేయడం కరెక్ట్ కాదు" అంటూ మైక్ ఇచ్చేసి సీరియస్ గా స్టేజి దిగి వెళ్ళిపోయింది.

దాంతో స్టేజి మీద ఉన్నవాళ్ళంతా షాకైపోయారు. అసలేమయ్యింది.. ఏం జరుగుతోంది.. అనుకుంటూ భయపడుతూ ఉండ‌గా, ప్రగతి గబగబా మళ్ళీ స్టేజి మీదకు వచ్చేసి మైక్ తీసుకుని "ఇక్కడ శ్రీదేవి డ్రామా కంపెనీ అంతా ప్రాంకులు చేస్తారని అన్నారు. అందుకే నాకు నచ్చినట్టు నేను ఏదో అలా ట్రై చేశా" అంటూ రష్మిని బుజ్జగించే ప్రయత్నం చేసింది.

అంతే! రష్మీ "హే" అంటూ నవ్వేసి హమ్మయ్య అంటూ హ్యాపీగా ఫీల్ అయ్యింది. అయితే ఆ త‌ర్వాత‌, "నేను ఇంత కష్టపడి ఇంతమందిని పిలిచి శ్రీదేవి డ్రామా కంపెనీ కేలండర్ ని లాంచ్ చేస్తే, అది కూడా సంవత్సరం మధ్యలో నా మీదే ప్రాంక్ చేస్తారా మీరందరూ.. నేను మీ అందరితో కటీఫ్.. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుస్తా" అని బుంగమూతి పెట్టి వెళ్ళిపోయింది రష్మీ.

Karthika Deepam2: వైరాతో జ్యోత్స్న డీలింగ్.. కార్తీక్ కి డౌట్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -544 లో.....శౌర్యకి దీప భోజనం తినిపిస్తుంది. అది చూసి కొడుకు కోడలితో చెల్లి మాట్లాడుతలేనట్లు ఉందని అనసూయ అంటుంది. వాళ్లే దాక్కొని తిరుగుతున్నారని కాంచన అంటుంది. శౌర్య వెంట భోజనం తినమని దీప పరుగెడుతుంది. శౌర్య అలా అమ్మని పరిగెత్తించవచ్చా.. ఇప్పుడు అమ్మ కడుపులో బేబీ ఉంది కదా తనకి ఆయాసం వస్తుంది ఇకనుండి నువ్వే భోజనం చెయ్యాలని కాంచన అనగానే.. నువ్వు మంచి నానమ్మవి కాదు నిన్ను తాతయ్య దగ్గరికి పంపించాలి.. మా అమ్మ నాకు తినిపించకుండా చేస్తున్నావని శౌర్య అంటుంది.

Illu illalu pillalu: ఇంగ్లీష్ టీచర్ గా శ్రీవల్లి.. ప్రేమ, నర్మద ప్లాన్ సూపర్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -345 లో... భాగ్యం, ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి శ్రీవల్లి డూప్లికేట్ సర్టిఫికేట్లు తీసుకొని వస్తారు. అవి ప్రేమ చూసి డూప్లికేట్ సర్టిఫికేట్లు అని చెప్పదు. ఇంకేంటి మావయ్య మీరు మీకు తెలిసిన కాలేజీ ప్రిన్సిపల్ కి ఫోన్ చెయ్యండి.. అక్క  ఇంగ్లీష్ టీచర్ గా జాయిన్ చెయ్యండి అని ప్రేమ అంటుంది. రామరాజు ఫోన్ చేస్తుంటే కావాలనే శ్రీవల్లి తుమ్ముతుంది. ఇప్పుడే వద్దు మావయ్య అంటుంది. అయినా రామరాజు వినకుండా ఫోన్ చేసి ప్రిన్సిపల్ తో మాట్లాడతాడు.