English | Telugu
జ్వాలను అవమానించడానికి శోభ పార్టీ ప్లాన్
Updated : Jun 3, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న `కార్తీకదీపం` సీరియల్ కుటుంబ నేపథ్యంలో సాగుతూ ఫ్యామిలీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టకుంటూ విజయవంతంగా దూసుకుపోతోంది. గత కొంత కాలంగా రేటింగ్ పరంగా టాప్ లో వున్న ఈ సీరియల్ ఇటీవల ఆ స్థాయిలో ఆకట్టుకోలేక కొంత డీలా పడింది. అయితే తాజా ఎపిసోడ్ లతో మళ్లీ కొంత వరకు పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ శుక్రవారం ఎపిసోడ్ ఎలాంటి మలుపులు తిరగబోతోంది? .. ఎలాంటి ట్విస్ట్ లకు వేదికగా నిలవబోతోందన్నది ఒకసారి తెలుసుకుందాం.
ఎపిసోడ్ ప్రారంభంలో నిరుపమ్ వాళ్ల అమ్మ స్వప్నతో మాట్లాడుతుంటాడు. నీ జీవితం ఇది నష్టపోతావు అని స్వప్న తిరుడుతూ వుంటుంది. ఆటో వాళ్లతో కలిసి తిరగడం ఏంటి అని నిరుపమ్ ని నిలదీస్తుంది. ఆ మాటలకు చిర్రెత్తుకొచ్చిన నిరుపమ్ నాకు నచ్చింది చేస్తాను.. ఆటో వాళ్లతోనే తిరుగుతాను అంటూ తల్లి స్వప్నకు షాకిస్తాడు. కట్ చేస్తే.. జ్వాల గురించి శోభ నిజాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ వుంటుంది. జ్వాల బాబాయ్ , పిన్నీ దొంగలు అని తెలుసుకుని మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఇదే సమయంలో సౌందర్య.. హిమని తిడుతూ వుంటుంది. నిరుపమ్ ని ఎందుకు వద్దన్నావ్.. నీ వల్ల నీ తల్లిదండ్రులకు మనశ్శాంతి లేకుండా చేశావ్ అంటుంది.
కట్ చేస్తే.. ప్రేమ్.. హిమను ప్రేమిస్తున్నానని చెప్పడానికి ఓ వీడియో పంపిస్తాడు. అది హిమ చూడకుండానే సౌందర్య, ఆనందరావులతో గొడవపడుతూ కోపంలో ఫోన్ విసిరేస్తుంది. దీంతో ప్రేమ్ ఆనందం ఆవిరైపోతుంది. ఇదిలా వుంటే జ్వాల, నిరుపమ్ ఆటోలో వెళ్తూ వుంటారు. జ్వాల మాట్లాడుతుంటే నిరుపమ్ మాత్రం మౌనంగా హిమ గురించి ఆలోచిస్తూ వుంటాడు. తన మాటలతో మొత్తానికి నిరుపమ్ ని జ్వాల కూల్ చేస్తుంది. మరోపక్క ప్రేమ్ ... హిమ రిప్లై ఇస్తే బాగుండు అని ఆలోచిస్తూ వుంటాడు.
కట్ చేస్తే.. జ్వాలని అవమానించాలని డిసైడ్ అయిన శోభ ఇందు కోసం పార్టీని ఏర్పాటు చేస్తుంది. ఈ పార్టీకి హిమ, నిరుపమ్, జ్వాల ముగ్గురూ రావాలని ఆహ్వానిస్తుంది. ఇదే పార్టీకి జ్వాల పిన్నీ, బాబాయ్ లని కూడా పిలిచి వారితో పనిచేయించి జ్వాల అవమానించాలనుకుంటుంది శోభ. ఆ తరువాత ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.