English | Telugu
పుట్టినరోజు నాడు పొట్టిబట్టల్లో శివజ్యోతి సందడి
Updated : Feb 15, 2023
జ్యోతక్క అలియాస్ శివజ్యోతి పుట్టినరోజు బాగా సెలెబ్రేట్ చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ శివజ్యోతి. తీన్మార్ వార్తల ద్వారా తెలంగాణ యాసతో శివజ్యోతి మస్త్ పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ లో శివజ్యోతి ఏడుపుల రాణిగా కూడా పేరు తెచ్చుకుంది. ఏ చిన్న బాధ కలిగేదైనా, సంతోషకర విషయమైనా జ్యోతక్క ఏడ్చేస్తుంది. ఆమె ఏడుపు మీద అప్పట్లో ఎన్నో ట్రోల్, మీమ్స్ కూడా వచ్చాయి. అందుకే అందరూ ఈమెను ముద్దుగా జ్యోతక్క అని ఆప్యాయంగా పిలుచుకుంటారు.
ఇక ఇప్పుడు శివజ్యోతి తన 30 ఇయర్స్ బర్త్ డే సెలెబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా చేసుకుంది. బిగ్ బాస్ తర్వాత ఈమె దశ తిరిగిపోయింది. ఈమె యూట్యూబ్ లో ఎన్నో వీడియోస్ చేస్తూ ఉంటుంది. తనతో పాటు తన భర్త గంగూలీని కూడా ఆడియన్స్ లో మంచి ఫేమస్ పర్సన్ గా చేసేసింది. బుల్లితెర మీద షోస్ లో, ఈవెంట్స్ లో వీళ్ళిద్దరూ కలిసి కనిపిస్తూ సందడి చేస్తూనే ఉంటారు. ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టింది శివజ్యోతి. తనకు 30 ఏళ్ళు వచ్చాయంటూ ఆనందంలో మునిగిపోయింది. పుట్టినరోజు నాడు పింక్ కలర్ పొట్టి డ్రెస్ వేసుకుని చిన్న పిల్లలా సందడి చేసింది. 30 ఇయర్స్ అంటూ బెలూన్స్ ను చేతిలో పట్టుకుని దిగిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్స్ అంతా ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పారు. అలాగే మరో యాంకర్ వింధ్య విశాఖ, రవికృష్ణ కూడా మెసేజెస్ పెట్టారు. కొంతమంది నెటిజన్స్ మాత్రం జ్యోతక్క డ్రెస్ మీద కామెంట్స్ చేశారు.
"అప్పుడు సావిత్రి అంటే సంప్రదాయం ..ఇప్పుడు నీవేమో పొట్టి డ్రెస్సులు...అక్కా ఏమిటి బ్లూ టిక్ ఉన్నవాళ్లకు మాత్రమే రిప్లై ఇస్తావా నీ ఫాన్స్ కి రిప్లై ఇవ్వవా " అంటూ కామెంట్ చేస్తున్నారు.