English | Telugu
పెళ్లిళ్లు అలా జరిగాయంటూ కామెడీ చేసిన సుమ!
Updated : Feb 15, 2023
సుమ అడ్డా షో ఈ వారం కూడా అలరించడానికి ఆడియన్స్ ముందుకు రాబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. నెక్స్ట్ వీక్ రఘు కుంచె, ఆర్పీ పట్నాయక్, శ్రీకృష్ణ, సాకేత్ కొమాండూరి ఎంట్రీ ఇచ్చారు.
"పక్కన పడ్డాది లేదో చూడవే పిల్ల " సాంగ్ ని పాడుతూ స్టేజి మీదకు వచ్చారు రఘు కుంచె. "జనాల ముందు అబ్బాయిలు బాగా నటిస్తారా అమ్మాయిలా" అని సుమ అడిగేసరికి ఒక స్టూడెంట్ లేచి "మేము సైట్ కొడుతున్నాం అని తెలిసి కూడా అమ్మాయిలు బాగా నటిస్తారు" అని ఆన్సర్ చేసేసరికి "లేకపోతే ఇలా ఊపుకుంటూ వచ్చేస్తారు మరి " అని రఘు కుంచె కౌంటర్ వేశారు. లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని నలుగురు గెస్టులను అడిగింది సుమ..."మాది లవ్ మ్యారేజ్ ట్రైన్ అలా వస్తోంది నేనే వెళ్ళా" అని సాకేత్ చెప్పాడు. మీది లవ్ ఆర్ అరేంజ్డ్ అని శ్రీకృష్ణను అడిగింది..అరేంజ్డ్ అని అతను ఆన్సర్ చేసాడు. "నాకు ఎక్స్పీరియెన్స్ ఆఫ్ అరేంజ్డ్ మ్యారేజ్ లేదు" అని సుమ కౌంటర్ వేసింది దానికి సాకేత్ "శ్రీకృష్ణ పరిగెడుతున్నాడు వెనక నుంచి ట్రైన్ వచ్చింది" అని కామెడీ చేసాడు.
"ఆర్పీ గారు ప్లాటుఫారం మీద ఉన్నప్పుడు ఒక ట్రైన్ వస్తోందన్న అనౌన్స్మెంట్ వచ్చింది. అది ఇలా వచ్చి ఆగగానే ట్రైన్ ఆయన్ని చూసి, ఈయన ట్రైన్ చూసి నవ్వడం జరిగింది" అని ఫన్నీగా పెళ్లి గురించి చెప్పింది సుమ. ఇక్కడ ట్రైన్ అంటే భార్య అని ఇండైరెక్ట్ గా చెప్పారంతా. ఇక ఇందులో కపిల్ శర్మ షోలో చూపించినట్టుగా మధ్యమధ్యలో కొన్ని పాత్రలు వచ్చిపోతుంటాయి. ఇలా నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ఫుల్ గా నవ్వించబోతోంది. సుమ క్యాష్ షోకి, ఆలీతో సరదాగా షోకి వచ్చినంత రేటింగ్ ఈ సుమ అడ్డా షోకి మాత్రం రావడం లేదు.