English | Telugu

ఫంక్షన్స్ లో దొంగతనంగా వెళ్లి తినేవాళ్ళం...


కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షో రాబోయే వారం షో ప్రోమో చూస్తే ఎవ్వరికైనా కన్నీళ్లు రాకమానవు. ఈ న్యూ ఎపిసోడ్ ని ఫ్రెండ్ షిప్ థీమ్ గా రాబోతోంది. దాంతో ఈ షోలో కంటెస్టెంట్స్ అంతా కూడా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చారు. ఇక శేఖర్ మాష్టర్ కోసం కూడా ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన ఎవరో కాదు సత్య మాష్టర్. ఇద్దరి మధ్య అంత ఎమోషనల్ బాండింగ్ ఎలా ఫార్మ్ అయ్యింది అని శ్రీముఖి అడిగేసరికి "ఉదయం 5 గంటలకే లేచేవాళ్ళం. రాత్రి వరకు మాకు డాన్స్ మాత్రమే ప్రపంచం అంతకు మించి మాకు ఇంకేం తెలీదు. మాకు ఆ టైములో తినడానికి కూడా ఏమీ ఉండేది కాదు. ఐదేళ్లు అలా ఉన్నాం. దొంగచాటుగా ఫంక్షన్ హాల్స్ కి వెళ్ళేవాళ్ళం.. అక్కడే ఎక్కువగా తినేవాళ్ళం.

అక్కడ తినేటప్పుడు రేయ్ ఎవర్రా మీరు. ఎవరి తరపున అని అడిగితే నేను మాట్లాడేవాడిని కాదు నాకు భయం అందుకే వీడే సమాధానం చెప్పేవాడు. అలా ఎన్నో సార్లు మాకు సత్యసాయి కల్యాణ మండపం, సవేరా ఫంక్షన్ హాల్ ఉండేవి. అవే మమ్మల్ని చాలావరకు కాపాడాయి. చెప్తారు కదా కష్టాల్లో ఉన్న ఫ్రెండ్ ని ఎవరూ ఎప్పటికీ మర్చిపోలేరని..మేము కూడా అలాగే కష్టాల్లోనే పెరిగాం ఎం మాట్లాడాలో అర్ధం కావట్లేదు." అంటూ శేఖర్ మాష్టర్ ఎమోషనల్ అయ్యాడు. రాకేష్ మాష్టర్ దగ్గర ఇప్పుడు ప్రముఖ కొరియోగ్రాఫర్స్ గా ఉన్న శేఖర్ , జానీ, సత్య మాష్టార్లు శిష్యులుగా ఉండేవాళ్ళు. ఇక శేఖర్ మాష్టర్ విషయానికి వస్తే రీసెంట్ గా ఆయన కొన్ని ట్రోలింగ్స్ ని కూడా ఎదుర్కొన్నారు. ఐతే రీసెంట్ గా "దబిడి దబిడి" సాంగ్ విషయంలో అలాగే "మిస్టర్ బచ్చన్" మూవీలోని సాంగ్ విషయంలో, పుష్ప 2 లో పీలింగ్స్ సాంగ్స్ విషయంలో కోరియోగ్రఫీ చేసి విమర్శలు ఎదుర్కున్నాడు. ఆ స్టెప్స్ వల్గర్ గా ఉన్నాయనే కామెంట్స్ ని ఫేస్ చేసాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.