English | Telugu
Illu illalu Pillalu: అన్నదమ్ముల మధ్య గొడవ.. ధీరజ్ కి తోడుగా ప్రేమ!
Updated : May 30, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-171లో.. చందు ఆఫీస్ కి రెడీ అవుతుంటే అప్పుడే శ్రీవల్లి వస్తుంది. మా ఆయన బంగారం.. ఎంత అందంగా ఉన్నారో నా దిష్టే తగిలేటట్టు ఉందని శ్రీవల్లి అనగానే చందు మురిసిపోతాడు. ఇక శ్రీవల్లికి చందు ముద్దు ఇవ్వాలనుకుంటాడు కానీ తను ఆపుతుంది. డోర్ ఓపెన్ లో ఉందని శ్రీవల్లి అనగానే చందు వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వస్తాడు. ఆ తర్వాత తనకి ముద్దు ఇచ్చి బయటకు వస్తాడు. కాసేపటికి మిల్లుకి బయల్దేరడానికి సాగర్ బయటకు వస్తాడు. అదే సమయంలో చందు రావడంతో తనతో మాట్లాడతాడు.
అన్నయ్య వదినకి చెప్పు.. నర్మదతో జాగ్రత్తగా మాట్లాడమని, అన్నింట్లో కలుగజేసుకోవద్దని చెప్పని చందుతో సాగర్ అంటాడు. వీళ్ళ మాటల్ని వేదవతి వింటుంది. ఇక చందు తన భార్యకి సపోర్ట్ చేసి మాట్లాడతాడు. నువ్వు నీ భార్యతో కలిసి ఎంజాయ్ చేయాలంటే నాన్నకి ఓ మాట చెప్తే సరిపోతుంది కదరా.. మీ ఫోన్ కలవట్లేదని నాన్న అంటే మీ ఇద్దరి ఫోటోలని వదిన నాన్నకి చూపించింది.. అందులో తప్పేం ఉంది.. నువ్వు తప్పు చేశావ్ ఇంకోసారి వదినతో జాగ్రత్తగా మాట్లాడమని నర్మదకి చెప్పు అని సాగర్ తో చందు అంటాడు. నువ్వు మారిపోయావ్ అన్నయ్య.. పెళ్ళికి ముందు నేనేదైనా తప్పు చేస్తే నువ్వు నాకు సపోర్ట్ చేసేవాడివి.. ఏదైనా నాన్నకి చెప్పలేకపోతే నీతో చెప్పేవాడివి కానీ ఇప్పుడేమో నీలో కొత్త మనిషి కన్పిస్తున్నాడంటూ సాగర్ ఎమోషనల్ అవుతాడు. కానీ చందు అదేం పట్డించుకోకుండా.. నర్మదని వదినతో జాగ్రత్తగా మాట్లాడమని చెప్పేసి వెళ్ళిపోతాడు.
మరోవైపు ధీరజ్ తన ఫ్రెండ్ బైక్ అడిగి తీసుకుంటాడు. ఆ తర్వాత కొరియర్ బాయ్ డ్రెస్ వేసుకొని వెళ్తుండగా విశ్వ చూస్తాడు. ఇక చిక్కాడు అని అనుకున్న ధీరజ్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకోవాలనుకుంటాడు. అందరి ఫోన్ ల నుండి ఆర్డర్ పెట్టమని చెప్తాడు. రాంగ్ లొకేషన్ పెట్టి ధీరజ్ ని అటుఇటు తిప్పుతారు. ఇక ఫైనల్ గా వాళ్ళ దగ్గరికి వచ్చిన ధీరజ్ ఫుల్ కోపంగా వెళ్తాడు. కానీ వాళ్ళ నాన్న అన్నమాటలు గుర్తొచ్చి సహనంగా ఉంటాడు. దాంతో విశ్వ అతని ఫ్రెండ్స్ కలిసి ధీరజ్ ని ఆడుకుంటారు. అప్పుడే అటుగా వెళ్తున్న ప్రేమ చూసి వాళ్ళ దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇచ్చి పంపిస్తుంది. నీకు సంబంధం లేదని ప్రేమతో విశ్వ అనగా.. ఇలాంటివి చేసి ఇంకా దిగజారకు అన్నయ్య... ధీరజ్ నా మొగుడు అని ప్రేమ అంటుంది. ఆ మాటలు విని ధీరజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.