English | Telugu

శైలేంద్ర మీద డౌట్ పడిన జగతి, వసుధార!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -750 లో.. ధరణి దుఃఖాన్ని ఆపుకోలేక జగతిపై పడి ఏడుస్తుంది. ఏంటీ ధరణి చిన్న పిల్లలాగా.. ఇన్ని రోజులు నీ భర్త కోసం ఎదురు చూసావ్.. ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావ్.. నీ కాపురాన్ని చక్కదిద్దుకోమని చెప్పి జగతి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అత్తయ్యని మార్చలేకపోయాను.. ఆయన్నయినా మార్చుకోవాలి.. తనకు నచ్చినట్లు నేను ఉంటే.. నన్ను ఇష్టపడుతాడు.. తనకి నచ్చినట్లు ఉండాలని ధరణి అనుకుంటుంది.

మరొకవైపు అనుకున్నట్లుగానే.. తల్లి కొడుకుల కుట్రలు మొదలుపెట్టారు. తాతయ్య గారు చైర్మన్ గా చేసాక.. ఆ తర్వాత మీ నాన్న గాని నువ్వు గాని చైర్మన్ గా కాలేజీని చూసుకుంటారని అనుకున్నాను అని దేవయాని శైలేంద్రతో అంటుంది. మౌనంగా ఉంటాడు శైలేంద్ర.. ఆ రిషి ఏదో కొన్ని రోజులు ఉంటాడని అనుకున్నాను కానీ రిషి కాలేజీ సామ్రాజ్యాన్ని విస్తరించాడు.. ఎలాగైనా కాలేజీని నీ సొంతం చేసుకోమని శైలేంద్రతో దేవయాని చెప్తుంది. వాళ్ళంతట వాళ్లే నన్ను ఆ కుర్చీలో కూర్చోపెట్టేలా చేస్తానని శైలేంద్ర అంటాడు. ఇంతలోనే రిషి వస్తాడు.. ఇప్పటివరకు అన్న మాటలు విన్నాడా అని ఇద్దరు టెన్షన్ పడుతారు. కానీ రిషి వినలేదు. వచ్చి శైలేంద్రతో మాట్లాడి వెళ్తాడు.‌ ఆ తర్వాత జగతి, వసుధారలు కలిసి ధరణి, శైలేంద్రలు హ్యాపీగా లేరని మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుతుండగా శైలేంద్ర వింటాడు. అలా విని వీళ్ళకి నాపై డౌట్ వచ్చిందని అనుకుని కావాలనే ధరణి దగ్గరికి వెళ్తాడు. జగతి, వసుధారలు వినేలా ధరణితో ప్రేమగా మాట్లాడుతాడు శైలేంద్ర. శైలేంద్ర చూపిస్తున్న ప్రేమకు ధరణి పొంగిపోయేలోపు.. ఎక్కువగా ఎగ్జయిట్ కాకు.. పిన్ని వాళ్లకు డౌట్ వచ్చిందని ఇలా మాట్లాడుతున్నానని శైలేంద్ర అనేసరికి.. ధరణి మళ్ళీ బాధపడుతుంది. ఆ తర్వాత జగతి, వసుధారల దగ్గరికి శైలేంద్ర వచ్చి.. మీరు ధరణికి చెప్పండి ఎలా ఉండాలో అని అంటాడు. వాళ్ళిద్దరు మౌనంగా ఉంటారు‌. ఆ తర్వాత వసుధారలాగా ధైర్యంగా ఉంటే నాకు ఇష్టం.. తనకి మీరు చెప్పండని చెప్పి శైలేంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

మరొకవైపు రిషి, వసుధారతో మాట్లాడాలని అనుకుంటాడు. ఇప్పుడు వెళ్తే బాగోదు.. ఫోన్ చేస్తే ఒకవేళ తను పడుకొని ఉంటే నిద్ర డిస్టర్బ్ అవుతుందని రిషి ఆలోచిస్తూ వసుధారకి మెసేజ్ చేస్తాడు. పడుకున్నావా అని మెసేజ్ చేస్తాడు.. లేదని వసుధార రిప్లై ఇస్తుంది. ఇంకా ఎందుకు పడుకోలేదని రిషి అంటాడు.. మరి మీరు ఇంకా ఎందుకు పడుకోలేదని వసుధార అంటుంది. వసుధార సిగ్గుపడుతూ రిషీతో చాట్ చేయడం జగతి చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.