English | Telugu
బ్రహ్మముడి పడిన రాజ్-కావ్య చేస్తున్న మౌనవ్రతం!
Updated : Apr 30, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -83 లో.. అయ్యగారిని పిలిపించి రాజ్, కావ్యల మధ్య అపార్థాలు తొలగిపోవాలని చెప్తారు సీతారామయ్య-ఇందిరాదేవిలు. దాంతో ఆ అయ్యగారు ఇద్దరు జాతకాలు చూసి.. వారి ఇద్దరి మధ్య ఉన్న దోషాలన్నీ పోవాలంటే వాళ్ళు మౌనవ్రతం చేయాలని చెప్తాడు. దాంతో రాజ్ పంచె ధరించి, కావ్య చీర ధరించి వ్రతానికి రెడీ అవుతారు. రాజ్ ఉత్తరీయం అంచుని, కావ్య చీర కొంగు అంచుని కలిపి బ్రహ్మముడి వేసి.. ఈ బ్రహ్మముడిని సూర్యాస్తమయం వరకు తీయకూడదని చెప్తాడు అయ్యగారు. సూర్యాస్తమయం వరకు ఎవరితోనూ మాట్లాడకూడదని చెప్పేసి అయ్యగారు వెళ్తాడు.
కనకం-కృష్ణమూర్తి ఇంటికి తిరిగి వచ్చిన స్వప్నకి పెళ్ళి చేయాలనుకుంటారు. దాంతో స్వప్న భయపడిపోయి ఆ విషయాన్ని రాహుల్ కి ఫోన్ చేసి చెప్పగా.. ఎప్పడు పడితే అప్పుడు నాకు కాల్ చెయ్యకు.. నన్ను బ్లాక్ మెయిల్ చేయకని రాహుల్ అంటాడు. ఇంకో గంటలో మా ఇంటి దగ్గర ఉన్న కేఫ్ కి రావాలని రాహుల్ తో చెప్తుంది స్వప్న. స్వప్న ఇలా రాహుల్ తో ఫోన్ లో మాట్లాడిందంతా అప్పు చాటుగా వింటుంది. అలా విని ఆ విషయాన్ని కళ్యాణ్ కి ఫోన్ చేసి చెప్తుంది. స్వప్న ఎవరిని ప్రేమించిందో తెలిసిపోతుంది.. నువ్వు మీ అన్నని తీసుకొనిరా అని కళ్యాణ్ తో అప్పు చెప్తుంది. దానికి కళ్యాణ్ సరేనంటాడు.
రాజ్, కావ్యలకి బ్రహ్మముడి పడిన తర్వాత.. వారి వారి స్వంత పనులు చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. తనకి ఆకలివేస్తుందని రాజ్ సైగలతో రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణకి చెప్పగా.. పక్కనే ఉన్న కావ్యకు టిఫిన్ పెట్టకుండా.. రాజ్ కి ఒక్కడికే టిఫిన్ పెడుతుంది అపర్ణ. అది చూసిన ధాన్యలక్ష్మి వచ్చి. అదేంటి అక్క కావ్యకి పెట్టలేదని చెప్పి తను వడ్డిస్తుంది. ఆ తర్వాత సడన్ గా కావ్యకి వెక్కిళ్ళు వస్తాయి. వెంటనే రాజ్ వాటర్ గ్లాస్ తీసుకొని వాటర్ మొత్తం తాగేస్తాడు. ఇక వెక్కిళ్ళు ఆగకపోవడంతో అపర్ణ జగ్ లో వాటర్ తెచ్చి కావ్యకి ఇస్తుంది. ఇదంతా చూసిన ఇందిరాదేవీ.. రుద్రాణి నీ ప్లాన్ సక్సెస్ అయ్యేలా ఉందని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.