English | Telugu

నెక్స్ట్ సీజన్ 'బిగ్ బాస్ హౌస్' లోకి అలనాటి అందాల నటి రాధా !

"నెక్స్ట్ సీజన్ కి బిగ్ బాస్ కి వెళదామని అనుకుంటున్నా" అంది అలనాటి అందాల నటి రాధ. వచ్చే వారం ప్రసారం కాబోయే బీబీ జోడి ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. నెక్స్ట్ వీక్ షోలో అదరగొట్టే పెర్ఫార్మెన్సెస్ తో కంటెస్టెంట్స్ రాబోతున్నారు. అంతకు మించి అన్నట్టుగా డాన్స్ చేసి సత్తా చాటారు జోడీస్.

ఇక ఈ షోలో అభినయశ్రీ-కౌషల్ జోడి ఎంతో అద్భుతంగా డాన్స్ చేశారు. "అనురాధ కూతురా మజాకానా" అని రాధా అంటే "నువ్వు మీ అమ్మనే డామినేట్ చేసేసావ్" అని కంప్లిమెంట్ ఇచ్చారు తరుణ్ మాస్టర్. అదే టైంకి వెనక నుంచి అభినయశ్రీ వాళ్ళ అమ్మ అనురాధ స్టేజి మీదకు ఎంట్రీ ఇచ్చారు. ఆమెను చూసి స్టేజి మొత్తం లేచి నిలబడింది. రాధ "వెల్కమ్ అను" అంటూ ఇన్వైట్ చేసింది. "రాధా నేను కలిసి చాలా సినిమాలు చేసాం అని అనురాధ అనేసరికి అవును నీ పని ఎప్పుడూ అదే కదా నా హీరోస్ వెంట పడి అలా లాగేస్తావ్ " అని కామెడీ చేసింది రాధ.

ఇక బ్యాక్ గ్రౌండ్ లో "నీ ఇల్లు బంగారం కాను" సాంగ్ వస్తుంటే రాధ, అనురాధ, అభినయశ్రీ అందరూ కలిసి డాన్స్ చేశారు. తర్వాత అభినయశ్రీ తన లైఫ్ లో జరిగిన ఇష్యూస్ చెప్పి బాధపడింది. "నాన్న లేకపోయినా నన్ను తమ్ముడిని పెంచి పెద్ద చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికీ మా అమ్మ ఎన్నో స్ట్రగుల్స్ పడుతూనే ఉంది " అనేసరికి అనురాధ కన్నీళ్లు పెట్టుకుంది. తర్వాత అఖిల్ సార్థక్ - తేజస్విని కలిసి అద్దిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసారు. తరుణ్ మాస్టర్ వాళ్ళ డాన్స్ కి పేపర్స్ చింపి మరీ ఆనందం వ్యక్తం చేశారు. తర్వాత కౌషల్ మాట్లాడుతూ "మీకు ఇచ్చిన థీమ్ కథక్. ఫినిషింగ్ లో టప్ టప్ అని వస్తూ ఉంటుంది" కానీ మీరు అలా చేయలేదు అనే సెన్స్ లో మాట్లాడేసరికి "ఐతే ఆ స్టెప్ ఎలా వేయాలో చూపించు" అని అఖిల్ సీరియస్ గా అడిగాడు. "నేనేమీ కథక్ డాన్సర్ ని కాదు కదా నీకు డాన్స్ స్టెప్స్ చూపించడానికి" అని కౌంటర్ వేసాడు కౌషల్. "మరి ఎందుకు అలా చెప్పావ్" అని రివర్స్ కౌంటర్ వేసాడు అఖిల్. "ఈ ఆటలన్నీ నాతో ఆడకు బిగ్ బాస్ హౌస్ లో ఆడుకో" అని అఖిల్ మరింత సీరియస్ గా ఆన్సర్ ఇచ్చాడు. "నువ్వు కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ వే కదా..ఎందుకలా మాట్లాడుతున్నావ్. నా కళ్ళతో చూసింది నేను చెప్పాను" అని కౌషల్ అనేసరికి "మేమూ మా కళ్ళతోనే చూస్తాం" అని అఖిల్ అన్నాడు.

తర్వాత అభినయశ్రీ-కౌషల్ పెర్ఫార్మెన్స్ మీద ఫైమా కామెంట్ చేసేసరికి కౌషల్ మండిపడ్డాడు. బిగ్ బాస్ హౌస్ లోనే కాదు బీబీ జోడిలో కూడా కౌషల్ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు మాట్లాడుతున్నాడు. "కావాలని ఎవరైనా పాయింట్స్ తగ్గిస్తే వాళ్లకు కూడా పాయింట్స్ తగ్గిపోతాయి" అని రాధా ఫైనల్ గా ఒక కంక్లూషన్ ఇచ్చింది. ఇక వాతావరణం మొత్తం హాట్ హాట్ గా ఉండేసరికి దాన్ని కూల్ చేయడానికన్నట్టుగా "నెక్స్ట్ సీజన్ కి బిగ్ బాస్ కి వెళదామని అనుకుంటున్నా" అని మనసులో మాట చెప్పింది...దాంతో స్టేజి మొత్తం అరుపులు కేకలు వినిపించాయి. ఏమో రాధ మాట గనక బిగ్ బాస్ వింటే సీనియర్ నటీ నటులతో ఒక బిగ్ బాస్ షో కూడా ప్లాన్ చేయొచ్చేమో..చూడాలి.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.