English | Telugu

మోనిత పెళ్లికూతురాయెనే!

శోభాశెట్టి అంటే ఎవరికీ తెలియదు. కానీ కార్తీకదీపం మోనిత అంటే చాలు టక్కున గుర్తొచ్చేస్తుంది కదా. ఇప్పుడు శోభాశెట్టి తన పెళ్లి చూపుల కోసం రెడీ అయ్యింది. ఆ వీడియోని తన యూట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. "ఒకసారి చూడండి నా గదిలో అంతా హంగామాగా ఉంది ఏమిటి అనుకుంటున్నారు కదా.

ఈరోజు నాకు పెళ్లి చూపులు అంటూ తెగ సిగ్గు పడిపోయింది. జనరల్ గా నేను అస్సలు సిగ్గు పడను. కానీ ఇప్పుడు నాకు పెళ్లిచూపులు అని చెప్పాలంటేనే చాలా సిగ్గు పడుతున్నాను. ఫస్ట్ టైం ఇలా సిగ్గు పడుతున్నాను అంటే నాకు పెళ్లి కళ వచ్చేసిందన్నమాట. అసలు విషయం ఏమిటి అంటే ఈరోజు నా బర్త్ డే. ప్రతీ సంవత్సరం నా పుట్టిన రోజు నాడు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం.

ఇక ఇప్పుడు మా అమ్మ నాకు చెప్పకుండా సీక్రెట్ గా ఒక అబ్బాయిని చూసింది. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు." అంటూ తన మేకోవర్ మొత్తాన్ని చూపించింది. పట్టుచీర కట్టుకుని కుందనపు బొమ్మలా కనిపించింది. ఐతే అసలు విషయం చెప్పలేదు అనుకుంటున్నారు కదా. ఆ విషయాన్ని మరో వీడియోలో చూపిస్తాను అని తన ఫాన్స్ ని ఊరించి వదిలేసింది. నెటిజన్స్ అంతా మోనితను విష్ చేశారు. సీరియల్ పూర్తయ్యాక పెళ్లి చూపులు పెట్టుకున్నారు..కంగ్రాట్యులేషన్స్ అంటున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.