English | Telugu
'ఆదికి ఏది ఆగదు' అన్న శేఖర్ మాస్టర్!
Updated : Jan 12, 2023
ఢీ-15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్ ప్రతీ వారం పర్వాలేదనిపిస్తూ ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఈ వారం కూడా అదే రేంజ్ లో ఆకట్టుకుంది. ఇందులో ఆది "ప్రేమాభిషేకం" మూవీలో నాగేశ్వరావు గెటప్ తో "ఆగదు ఆగదు" అనే పాట పాడుకుంటూ మందు బాటిల్ ని మరో వైపు కుక్కను పట్టుకొచ్చాడు స్టేజి మీదకు. "ఏం ఆగదు" సర్ అని ప్రదీప్ అడిగాడు. "ఈ స్టేజిని చూస్తే డాన్సర్ లకు ఆగదు..ఢీ టైటిల్ ని చూస్తే కొరియోగ్రాఫర్లకు ఆగదు, శ్రద్దాదాస్ ని చూస్తే నాకు ఆగదు" అని కామెడీ చేసాడు ఆది. "అది నాకు తెలుసు నీకు ఏదీ ఆగదు " అని శేఖర్ మాస్టర్ పంచ్ వేసాడు. "ఇందాక ఎవడ్రా మా ఇంటి ముందుకు వచ్చి డాన్సులు వేసింది" అని ఆది సీరియస్ అయ్యేసరికి .."ఏయ్ మా మాస్టర్ల గురించి తక్కువ చేసి మాట్లాడకు ఆది.
ఎండనక, వాననకా, రేయనక, పగలనక , దెబ్బలని కూడా లెక్క చేయకుండా ప్రాణాల్ని ఫణంగా పెట్టి..పస్తులుండి, అప్పులు చేసి టైటిల్ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు..వాళ్ళురా మా మాస్టర్లంటే" అని ప్రదీప్ డైలాగ్ చెప్పేసరికి అందరూ వీలలు వేసి ఎంకరేజ్ చేశారు. ఆది లవ్ లో ఫెయిల్ అయ్యి మందు బాటిల్ తెచ్చుకున్నట్లు చెప్పి నవ్వించాడు. "అప్పట్లో ప్రేమలకు ఇప్పటి ప్రేమలకు చిన్న తేడా ఉంది ఉంది..అప్పట్లో అమ్మాయిని ప్రేమిస్తే అమ్మడు అని తిరిగేవాళ్ళం కానీ ఇప్పుడు అమ్మడు..లెట్స్ డూ కుమ్ముడు అని తిరుగుతున్నాం" అని ప్రేమ గురించి చెప్పాడు. ఇంతకు నువ్ ప్రేమించిన అమ్మాయి ఎవరు అని ప్రదీప్ అడిగేసరికి మా పక్కింట్లో ఉన్న దివ్య అని చెప్పాడు ఆది.
అంతలో దివ్య "సిరిమల్లె పువ్వా" సాంగ్ పాడుకుంటూ బయటికి వచ్చింది.
ఇంతలో బిందె పట్టుకుని మోడల్ జెస్సి "ఎల్లువొచ్చి గోదారమ్మ" సాంగ్ పాడుతూ డాన్స్ చేస్తూ దివ్య దగ్గరకు వచ్చాడు. "ఇంతకు ప్రదీప్ వీళ్లల్లో అమ్మాయి ఎవరు, అబ్బాయి ఎవరు" అని శేఖర్ మాస్టర్ అడిగేసరికి "అమ్మాయి మేల్ గెటప్ వేసినట్టుంది అంట నువ్వు పక్కకు రా" అన్నాడు ఆది. "దివ్య నన్ను పెళ్లిచేసుకుంటావా" అని ఆది అడిగేసరికి "నాకు నువ్వంటే ఇష్టం లేదు..జెస్సి అంటే ఇష్టం" అని చెప్పింది దివ్య..తర్వాత జెస్సి వెళ్లి తనను పెళ్లి చేసుకోమని అడిగేసరికి "ఏదో ఆది నుంచి తప్పించుకోవడానికి నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పా" అంతే అని వెళ్ళిపోతుంది. "అదేంటి జెస్సి మందు తాగాక కదా ఎవరైనా ఊగుతారు..నువ్వెంటి ఊగేసాక తాగుతున్నావ్" అని కామెడీ చేసేసరికి అందరూ నవ్వేశారు.