English | Telugu
మా సంక్రాంతి పందెం...అంటూ ఎంటర్టైన్ చేయడానికి వస్తున్న బుల్లితెర నటులు!
Updated : Jan 12, 2023
"ఇన్నాళ్లు మీరు సంక్రాంతికి కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు చూసుంటారు..కానీ ఈ సంక్రాంతికి అంతకు మించిన పందెం చూడబోతున్నారు" అంటూ సుడిగాలి సుధీర్ "మా సంక్రాంతి పందెం" ఈవెంట్ ని హోస్ట్ చేసిన ప్రోమో ఇప్పుడు రిలీజ్ అయ్యింది. "మా సంక్రాంతి పందెం సందడి చేయడానికి మా స్టార్ మా మొత్తం సిద్ధం" అని చెప్పాడు సుధీర్. ఇక ఈ ఈవెంట్ కి బుల్లితెర యాక్టర్స్ మొత్తం ఎంట్రీ ఇచ్చారు.
ఇక "ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్" బాలయ్య సాంగ్ కి డాన్స్ చేస్తూ స్టేజి మీదకు వచ్చాడు. ఇక చంద్రహాస్ ఎలా ఐతే ఆటిట్యూడ్ చూపిస్తూ పోజులు, ఎక్స్ప్రెషన్స్ పెడతాడో జబర్దస్త్ అవినాష్ కూడా అలాగే ఇమిటేట్ చేసి చూపించి ఎంటర్టైన్ చేసాడు. "నీ ఆటిట్యూడ్ కి చాలా ట్రోల్ల్స్ వచ్చాయి..అంత కాన్ఫిడెంట్ ఎలా వచ్చింది అని అవినాష్ అడిగేసరికి..పిచ్చ లైట్ తీసుకున్నా" అని ఆన్సర్ చేసాడు చంద్రహాస్. తర్వాత "పేట" మూవీ నుంచి "మరణం..మాస్ మరణం" సాంగ్ కి తండ్రికొడుకులైన ప్రభాకర్-చంద్రహాస్ ఇద్దరూ డాన్స్ చేశారు. బుల్లితెర స్టార్స్ తో రాంప్ వాక్ చేయించారు. ఈ షోకి "కళ్యాణం..కమనీయం" మూవీ టీమ్ వచ్చింది. ఇక రీసెంట్ గా పెళ్లి చేసుకున్న అమరదీప్-తేజస్వినిని స్పెషల్ గా ట్రీట్ చేశారు.
అలాగే బిగ్ బాస్ విన్నర్ సింగర్ రేవంత్ అద్దిరిపోయే సాంగ్స్ పాడి స్టేజి మొత్తాన్ని ఒక ఊపు ఊపేసాడు. ఇక అమరదీప్-తేజస్వినికి అందరి తరపున బొట్టు పెట్టి పెళ్లయ్యాక వచ్చిన ఫస్ట్ పండగ కాబట్టి చేతికి గాజులు వేసి చీర-సారె పెట్టారు. వాళ్ళతో సరదా గేమ్స్ కూడా ఆడించారు. ఇక ఆ జంట నిరుపమ్ పరిటాల-మంజుల భార్యాభర్తల దగ్గరకు వెళ్లి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక బుల్లితెర స్టార్స్, కామెడీ స్టార్స్ అంతా రెండు భాగాలుగా విడిపోయారు. ఒక టీమ్ చిరంజీవిని పొగిడారు. " ట్విన్కిల్ ట్విన్కిల్ లిటిల్ స్టార్..చిరంజీవి మెగాస్టార్" మరో టీమ్ లో అవినాష్ తో ఉన్న వాళ్లంతా "కోకో కోలా పెప్సీ...బాలకృష్ణ సెక్సీ" అంటూ మాస్ స్టయిల్లో డైలాగ్స్ చెప్పారు. ఇలా ఆడియన్స్ అలరించడానికి ఈ పండగ ఈవెంట్ 14 వ తేదీన స్టార్ మాలో రాబోతోంది.