English | Telugu

మా అమ్మే నాకు మళ్ళీ కూతురిగా పుట్టాలి అంటూ ఏడ్చేసిన సౌమ్య

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే చాలు నవ్వొచ్చేస్తుంది. ఆదికి పెళ్లి చూపులు అనే కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. బుల్లితెర యాంకర్స్, నటీనటులు చాలామంది ఈ షోలో కనిపించారు. వర్షంలో గొడుగులు వేసుకుని మరీ ఆది పెళ్ళిచూపులకి వచ్చారు. ఆది పెళ్ళికొడుకు గెటప్ లో సూటు వేసుకుని వచ్చాడు. ఐతే ఆది పెళ్ళికొడుకు అని తెలియక అంకుల్ అని అనేసింది వర్ష. దానికి ఆది హర్ట్ అయ్యాడు. "అంకుల్ ఏంటి నేనే పెళ్ళికొడుకుని" అనేసరికి చెవులు చిల్లులు పడేలా జారీచేసింది. ఇక వర్షంలో తడిచి వచ్చిన యాంకర్ సౌమ్యను తుండుతో తుడిచాడు ఆది. "ఎంతేశావమ్మా మేకప్ టవల్ లోకి మొత్తం వచ్చేసింది" అన్నాడు ఆది.

ఇక ఇంద్రావతి చౌహాన్ ఫోక్ సాంగ్ పాడితే ఆర్జే కాజల్ మంచి మెలోడీ సాంగ్ పాడింది. ఇక సౌమ్య, ఆది ఇద్దరూ కలిసి "వాన వల్లప్పా వల్లప్పా ఒళ్లప్పగించే " అనే రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేశారు. ఇక పెళ్లి కానీ అమ్మాయిలంతా కలిసి మంచి సాంగ్స్ పాడి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. ఇక ఆది సౌమ్య కోసం ఒక గిఫ్ట్ కూడా ఇచ్చాడు. వాళ్ళ అమ్మ ఫోటోని లామినేషన్ చేసి ఇచ్చాడు. అది చూసేసరికి ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. అలాగే వాళ్ళ అమ్మ బ్రెయిన్ కాన్సర్ తో బాధపడుతూ హాస్పిటల్ ఉన్నప్పుడు వీడియోని ప్లే చేశారు. " మా అమ్మ ఈ పొజిషన్ లో ఉండగా మూడున్నరేళ్లు ఆమెకు సేవలు చేసాను. కానీ ఆమె నన్ను గుర్తుపట్టే పొజిషన్ లో లేరు. దేవుడు ఆమెకు ఇలాంటి పరిస్థితిని ఇస్తాడని అస్సలు అనుకోలేదు. మా అమ్మే నాకు మళ్ళీ కూతురిగా పుట్టాలని కోరుకుంటున్నా" అని ఏడ్చేసింది సౌమ్య.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.