English | Telugu
సాయిపల్లవికి ఆ చిరంజీవి పాటంటే పిచ్చి ఇష్టం!
Updated : Jun 11, 2022
ఫిదా మూవీ పేరు వినగానే ముందు గుర్తొచ్చేది సాయి పల్లవి. రీసెంట్ గా లవ్ స్టోరీ మూవీలో తన నటనతో ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా డాన్స్ తో ప్రేక్షకులను ఫిదా చేసేసింది. మూవీస్ లో సాయి పల్లవి డాన్స్ ముందు ఏ హీరో ఐనా వీక్ ఐపోతాడు. ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరూ సాయి పల్లవి డాన్స్ ని మెచ్చుకునే వాళ్ళే , పొగిడేవాళ్ళే. చిరంజీవికి కూడా పల్లవి డాన్స్ అంటే చాలా ఇష్టమట.
సాయి పల్లవికి మాత్రం చిరు డాన్స్ చేసిన "నడక కలిసిన "సాంగ్ అంటే చాలా ఇష్టమట. ఆ డాన్స్ లో చాలా గ్రేస్ ఉంటుంది అది డాన్స్ అంటే అని కితాబిచ్చింది. అందుకే నాకు ఆయన డాన్స్ అంటే చాలా ఇష్టం అంది పల్లవి. తన మూవీస్ కి తానే డబ్బింగ్ చెప్పుకుంటానని చెప్పింది. సాయి పల్లవి తాను సంపాదించేది మొత్తం తల్లికే ఇచ్చేస్తోందట. ఇలా ఎన్నో విషయాల సమాహారంతో పల్లవి తన మనసులోని మాటను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో పంచుకుంది. ఈ ప్రోమో ఇప్పుడు రిలీజ్ అయ్యింది.