English | Telugu
ఎలిమినేషన్ లో తప్పు జరిగింది.. సందీప్ మళ్ళీ వస్తున్నాడు!
Updated : Oct 30, 2023
అన్న మళ్ళీ వస్తున్నాడు. ఎస్ ఇది నిజమే. బిగ్ బాస్ సీజన్-7 లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కంటెస్టెంట్ ఆట సందీప్. బిగ్ బాస్ సీజన్-7 లో మొట్టమొదటి హౌస్ మేట్ గా నిలిచిన ఆట సందీప్ ఎనిమిదవ వారం ఎలిమినేట్ అయ్యాడు. ఇప్పుడు ఈ ఎలిమినేషన్ పై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరి అసలు కథేంటి.. ఈ ఎలిమినేషన్ వెనుక నిజాలేంటో ఒకసారి చూసేద్దాం. గతవారం జరిగిన నామినేషన్‌లో యావర్ , టేస్టీ తేజ కలిసి ఆట సందీప్ ని నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక నామినేషన్‌లో ఉన్న ఆట సందీప్.. ఓటింగ్ విషయంలో లీస్ట్ లో ఉండటంతో బిగ్ బాస్ ఎలిమినేట్ చేసేశాడు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అసలు ఓటింగ్ లో లీస్ట్ లో ఉంది శోభాశెట్టి. కానీ బిగ్ బాస్ ఆడిన ఆటలో ఆట సందీప్ ఎలిమినేట్ అయ్యాడని నెటిజన్లు భావిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే.. గత ఏడు వారాల నుండి హౌస్ నుండి ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతున్నారు. కాగా ఈ వారం కుడా శోభాశెట్టి ఎలిమినేషన్ అయితే హౌస్ లో కలరింగ్ తగ్గుతుందని భావించిన బిగ్ బాస్.. ఈ ట్విస్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే హౌస్ లో ఆట సందీప్ చాలాసార్లు సంచాలకుడిగా చేశాడు. కానీ అన్నిసార్లు సీరియల్ బ్యాచ్ ని గెలిపించడానికి ఫౌల్స్ చేశాడని ప్రేక్షకులకి తెలిసిందే.
మొదట హౌస్ మేట్ గా స్ట్రాంగ్ గా ఉన్న ఆట సందీప్.. సీరియల్ బ్యాచ్ తో కలిసిపోయి తన ఆటని మరిచిపోయాడు. ఇక అక్కడి నుండి వారేం చేస్తే అదే కరెక్ట్ అన్న పంథాలో వెళ్ళడంతో.. హౌస్ లో ఫెయర్ గేమ్ ఆడే యావర్, ప్రశాంత్, శివాజీలని తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఫెయర్ గేమ్ ఆడేవారికి ఫ్యాన్ బేస్ ఉంటుందనే విషయం తెలిసిందే. వారంతా ఆట సందీప్ కి వ్యతిరేకంగా నిలిచి ఓటింగ్ చేయకపోవడంతో అతను ఈ వారం ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఆట సందీప్ తన ఇన్ స్టాగ్రామ్ లో.. " This is not the 'END'.. ULTA PULTA " అని పోస్ట్ చేశాడు. దీన్ని బట్టి ఆట సందీప్ మళ్లీ హౌస్ లోకి వస్తున్నాడని అర్థమవుతోంది. మరి ఆట సందీప్ మళ్ళీ రీఎంట్రీ ఇస్తాడా? బిగ్ బాస్ ఉల్టా పల్టా చేస్తాడా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.