English | Telugu
దీప, కార్తీక్‌ల జీవితాల్లో రుద్రాణి కల్లోలం
Updated : Dec 9, 2021
బుల్లితెర వీక్షకుల్ని విశేషంగా అలరిస్తున్న సీరియల్ `కార్తీక దీపం`. గత కొన్ని వారాలుగా చిత్ర విచిత్రమైన మలుపులు.. ట్విస్ట్‌లతో సాగుతున్న ఈ సీరియల్ ఈ గురువారం మరో కొత్త అంకానికి తెరలేపబోతోంది. కొత్త విలన్‌ని పరిచయం చేయబోతోంది. ఈ గురువారం కార్తీక దీపం 1218వ ఎపిసోడ్ లోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగానే దీపకు కొత్త కష్టాలని.. కొత్త శత్రువుని పరిచయం చేయబోతున్నాడు డైరెక్టర్.
కంటతడి పెట్టిన `కార్తీక దీపం` నటి
గురువారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఓ సారి లుక్కేద్దాం. మోనిత కుట్రతో సర్వం కోల్పోయిన డాక్టర్ బాబు తన భార్యా పిల్లలతో కలిసి ఇళ్లు వదిలి.. ఊరు వదిలి వెళ్లిపోతాడు. తన దగ్గర ఫోన్ వుంటే ఎక్కడ తన తల్లి ఫోన్ చేసి తాము ఎక్కడున్నామో తెలుసుకుంటుందని తన ఫోన్‌ని కూడా పడేస్తాడు కార్తీక్. తనకు చెప్పకుండా కార్తీక్ , దీప పిల్లలతో కలిసి ఇళ్లు విడిచి వెళ్లిపోయాడని తెలుసుకున్న సౌందర్య కుమిలి కుమిలి ఏడుస్తుంటుంది. అదే పమయంలో ఇంటికొచ్చిన మోనిత .. కార్తీక్ ని కావాలని మీరే పంపించారా... లేక కార్తీకే వెళ్లిపోయాడా? అని నిలదీస్తుంది.
కట్ చేస్తే కార్తీక్, దీప పిల్లలతో కలిసి ఓ ఇంటి ముందు ఆగుతారు. ఇంతలో ఒకవిడ వచ్చి ఎవరమ్మా మీరు ఈ ఊళ్లో ఎప్పుడూ చూడలేదు అంటుంది. మేం ఊరికి కొత్త.. పని వెతుక్కుంటూ వచ్చాం అంటుంది. ఈ ఇంటి యజమాని గురించి మీకు తెలియదు వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటుంది. కానీ దీప పట్టించుకోదు... కట్ చేస్తే రుద్రాణి ఇంటికే వెళ్లి పలకరిస్తుంది. తనని వెతుక్కుంటూ వచ్చిన దీపకు ఇంద్రాణి ఎలాంటి షాక్ ఇచ్చింది? .. కార్తీక్ , దీపల జీవితాల్లో రుద్రాణి సృష్టించిన కల్లోలం ఏంటీ అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.